రెప్పపాటులో తప్పిన ఘోర విమాన ప్రమాదం: ఫ్లైట్‌లో 122 మంది

First Published 14, Mar 2019, 5:30 PM IST
taiwan aircraft overshoots in kalibo airport philippines
Highlights

ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 157 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైన ఘటన ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది. ఈ క్రమంలో గురువారం మరో పెను విషాదం తృుటిలో తప్పిపోయింది.

ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 157 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైన ఘటన ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది. ఈ క్రమంలో గురువారం మరో పెను విషాదం తృుటిలో తప్పిపోయింది.

వివరాల్లోకి వెళితే.. తైవాన్ నుంచి ఫిలిప్పీన్స్‌లోని కలిబో విమానాశ్రయానికి 122 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానం ప్రమాదానికి గురైంది. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా రన్‌వే చివర్లో మలుపు తిరిగుతుండగా పక్కనే ఉన్న గడ్డిలోకి దూసుకెళ్లింది.

విమానం చక్రాలు గడ్డిలో చిక్కుకుపోవడంతో విమానం అక్కడే నిలిచిపోయింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి వెంటనే ఇంజిన్ ఆఫ్ చేయడంతో అది అక్కడే నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

loader