కాకులా మ‌జాకా ! క్లినింగ్ ప‌నుల్లోకి వెళ్లి మ‌రీ ఆహారం సంపాదించుకుంటున్న‌య్ !

సాధార‌ణంగా పారిశుధ్య ప‌నుల‌ను మ‌నుషులు చేస్తుంటారు. ఈ మ‌ధ్య కాలంలో ఈ ప‌నులు చేయ‌డానికి యంత్రాలు కూడా అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే, ఎంతో  తెలివిగా ఆలోచించే కాకులు మ‌రో సారి త‌మ ప్ర‌త్యేక‌త‌ను ప్ర‌పంచానికి చూపిస్తున్నాయి. ఏకంగా క్లినింగ్ ప‌నుల్లోకి వెళ్లి మ‌రీ.. ఆహారం సంపాదించుకుంటున్నాయి.. కాకులా మ‌జాకా అనే విధంగా అంద‌రినీ ముక్కున వేలేసుకునేలా  ఔరా అంటూ ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నాయి. 
 

Swedish firm deploys crows to pick up cigarette butts

crows to pick up cigarette butts: ఎంతో  తెలివిగా ఆలోచించే కాకులు మ‌రో సారి త‌మ ప్ర‌త్యేక‌త‌ను ప్ర‌పంచానికి చూపిస్తున్నాయి. ఏకంగా క్లినింగ్ ప‌నుల్లోకి వెళ్లి మ‌రీ.. ఆహారం సంపాదించుకుంటున్నాయి.. కాకులా మ‌జాకా అనే విధంగా అంద‌రినీ ముక్కున వేలేసుకునేలా  ఔరా ! అంటూ ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నాయి. 

తెలివిగా ఆలోచించ‌డం, స్మార్ట్ వ‌ర్క్ ను గుర్తు చేస్తూ.. అంద‌రికీ అద‌ర్శంగా నిలిచే కాకి (crows) క‌థ గురించి దాదాపు అంద‌రికీ తెలిసే ఉంటుంది. ఆ క‌థ‌లో కాకికి దాహం వేస్తుంది. నీళ్లు తాగ‌డానికి వెతుకుతున్న త‌రుణంలో ఒక కుండ‌లో త‌క్కువ‌గా నీళ్లు ఉండ‌టం గ‌మ‌నించి.. ఆ నీళ్ల‌ను పైకి తీసుకురావ‌డానికి అందులో గుల‌క‌రాళ్లు వేస్తుంది. ఈ క్ర‌మంలోనే నీళ్లుపైకి రావ‌డంతో వాటిని దాగి త‌న దాహం తీర్చుకుంటుంది కాకి.  ఇలా స్మార్ట్ గా ఆలోచించే కాకులు ఇప్పుడు మ‌రోసారి త‌మ ప్ర‌త్యేక‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తూ.. ఆంద‌ర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏకంగా పారిశుధ్య పనుల్లో పాల్గొంటున్నాయి. తమకు కావాల్సిన ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి. 

వివరాల్లోకెళ్తే.. చాలా కాలం నుంచి స్వీడన్ విధుల్లో, అక్కడి చౌరస్తాల్లో సిగరెట్ తాగిన జనాలు ఎక్కడపడితే అక్కడ సిగరెట్ పీకలను(cigarette butts) పడేస్తున్నారు. అయితే, అక్కడి పారిశుధ్య విభాగాలకు వీటిని సేకరించడం.. సిగరెట్లు తాగడానికి ఖర్చు చేస్తున్న వారి డబ్బుకంటే ఎక్కువ అవుతున్నదని పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే  సిగ‌రెట్ పీక‌లను సేక‌రించ‌డానికి సంబంధించి ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునే చ‌ర్య‌ల్లో భాగంగా అక్క‌డి ఓ సంస్థ ఎంతో తెలివిగా ఆలోచించే కాకులను  (crows) ఎంచుకున్నారు. అక్క‌డ పేరుకుపోతున్న సిగ‌రెట్ పీక‌ల (cigarette butts) ను సేక‌రించ‌డానికి కొన్ని కాకుల‌ను ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇచ్చారు. ఇప్పుడు ఆ కాకులు మిగ‌తా వాటికి ఈ ప‌నిని నేర్పిస్తున్నాయి. దీంతో చాలా కాకులు అక్క‌డి విధుల్లోని సిగ‌రెట్ పీక‌ల‌ను సేక‌రిస్తున్నాయి. 

కాకులు (crows) అలా సేక‌రించిన పీక‌ల (cigarette butts)ను అక్క‌డి ఒక స్టార్ట‌ప్ కంపెనీ రూపొందించి ప్ర‌త్యేక మిష‌న్ లో  వేస్తాయి. అందులో వేయ‌గానే కాకుల‌కు అందులోంచి ఆహారం వ‌స్తుంది. ఇలా ప్ర‌తీ సిగ‌రెట్ పీకకు త‌క్కువ మొత్తంగా ఆహారం అందిస్తున్నారు. ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మంలో అక్క‌డి కాకులు స్వ‌చ్ఛందంగా పాలుపంచుకుంటున్నాయ‌ని స్వీడ‌న్ అధికారులు చెబుతున్నారు. దీనిపై కోర్విడ్ క్లీనింగ్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు క్రిస్టియన్ గుంథర్-హాన్సెన్ మాట్లాడుతూ.. పీక‌ల సేక‌ర‌ణ‌లో స్వ‌చ్ఛందంగా పాల్గొనే అడ‌వి ప‌క్షులు కాకులు అని తెలిపారు. Swedish Tidy Foundation ప్రకారం స్వీడిష్ వీధుల్లో ప్రతి సంవత్సరం 1 బిలియన్ కంటే ఎక్కువ సిగరెట్ పీకలు మిగిలి ఉంటున్నాయి. అక్క‌డి మొత్తం వ్యర్థాలలో 62 శాతం సిగ‌రెట్ పీక‌లే ఉంటున్నాయి. సిగ‌రెట్ పీక‌ల‌ను ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ప‌డేయ‌వ‌ద్ద‌ని అక్క‌డి అధికారులు పేర్కొంటున్న ఫ‌లితం లేక‌పోవ‌డంతో స్టార్ట‌ప్ కంపెనీ కాకుల‌తో స్మార్ట్ గా ప‌ని చేస్తోంది.  

అయితే, ఈ ప‌నికి కాకుల‌నే (crows) ఎంచుకోవ‌డంపై కోర్విడ్ క్లీనింగ్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు క్రిస్టియన్ గుంథర్-హాన్సెన్ మాట్లాడుతూ.. కాకులకు శిక్ష‌ణ ఇవ్వ‌డం చాలా తేలిక‌. అలాగే, అవి ఒక‌దాని నుంచి మ‌రొక‌టి త్వ‌ర‌గా నేర్చుకుంటాయి. పొర‌పాటున కూడా అవి ఈ పీక‌ల‌ను తిన‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌వు. ఎందుకంటే కాకులు త‌మ ఆహారం విష‌యంలో ఖ‌చ్చితంగా ఉంటాయి అని ఆయ‌న తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios