Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ పై ప్రపంచ పోరాటం... స్పెషల్ ప్యానెల్ లో సుందర్ పిచాయ్..!

ఇండియన్ అమెరికన్లయిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, డెలాయిట్ సీఈవో పునీత్ రంజన్, అడోబ్ సీఈవో శాంతనూ నారాయణన్ లు ఈ కమిటీలో నియమించారు. కరోనా పోరాటంపై వీరు దేశాలకు ఈ ప్యానెల్ ద్వారా సహాయం చేయనున్నారు.

Sunder Pichai, 2 Other Indian-Americans On Covid Global Taskforce Panel
Author
Hyderabad, First Published May 7, 2021, 10:35 AM IST

కరోనా మహమ్మారి భారత్ లో వికృత రూపం దాల్చింది. కేవలం భారత్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అయితే.. భారత్ లో కాస్త ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని అరికట్టేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

ఈ క్రమంలో.. ప్రత్యేకంగా ఈ మహమ్మారిని అరికట్టేందుకు ఓ ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేశారు. కోవిడ్ గ్లోబల్ టాస్క్ ఫోర్స్ పేరిట స్పెషల్ ప్యానెల్ ఏర్పాటు చేయగా.. దానిలో భారత సంతతికి చెందిన ముగ్గురు అమెరికన్లు ఉండటం విశేషం. 

ఇండియన్ అమెరికన్లయిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, డెలాయిట్ సీఈవో పునీత్ రంజన్, అడోబ్ సీఈవో శాంతనూ నారాయణన్ లు ఈ కమిటీలో నియమించారు. కరోనా పోరాటంపై వీరు దేశాలకు ఈ ప్యానెల్ ద్వారా సహాయం చేయనున్నారు.

ఈ కమిటీలో చాలా మంది ఉండగా.. భారత్ కి చెందిన ముగ్గురు ముఖ్యులకు కూడా చోటుదక్కడం హర్షణీయం. భారత్ లో కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు.. ఈ ముగ్గురు సీఈవోలు సహకరించనున్నారు.

వీరితోపాటు.. బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ సీఈవో మార్క్ సుజ్మన్, బిజినెస్ రౌండ్ టేబుల్ ప్రెసిడెండ్ కమ్ సీఈవో జోషువా బుల్టెన్, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈవో, ప్రెసిడెంట్ షుజానే క్లార్క్ లకు కూడా ఈ కమిటీలో చోటు దక్కింది.

ఈ టాస్క్ ఫోర్స్  యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేత నిర్వహించబడిన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం. దీనికి రౌండ్ టేబుల్ మద్దతుగా నిలుస్తోంది.

కాగా..  భారతదేశంలో COVID-19 సృష్టిస్తున్న ప్రకంపనులను తగ్గించడానికి.. అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవడానికి ఈ టాస్క్ ఫోర్స్ US- ఇండియా బిజినెస్ కౌన్సిల్,  US- ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్‌తో కలిసి పనిచేస్తోంది.

యుఎస్ కార్పొరేట్ రంగం ఇప్పటివరకు భారతదేశానికి 25 వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ని పంపించాలనే నిర్ణయం తీసుకుంది.వీటిలో వెయ్యి ఆక్సీజన్ కాన్సన్ ట్రేటర్స్ ని డెలాయిట్ కంపెనీ తరపున గత నెల ఏప్రిల్ లో భారత్ కి పంపించారు. 

ఈ ఏకాగ్రతలను తక్షణ ఉపయోగం కోసం నియమించబడిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు రవాణా చేయనున్నట్లు టాస్క్‌ఫోర్స్ తెలిపింది.

వెంటిలేటర్ల సరఫరా కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. జూన్ 3వ తేదీ నాటికి భారత్ కి వెయ్యి వెంటిలేటర్లు చేరుకోనున్నాయి. వెంటిలేటర్స్ పంపిణీకి దాదాపు 16 వ్యాపార దిగ్గజాలను ఈ టాస్క్ ఫోర్స్ తో కలవడం గమనార్హం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios