సూడాన్ లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఓ గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. 

ఆఫ్రికన్ కంట్రీ సూడాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడి ఓ గ్రామం మొత్తాన్ని కప్పేశాయి... దీంతో దాదాపు 1000 మందికిపైగా మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. మర్రా పర్వతప్రాంతంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం గురించి సూడాన్ లిబరేషన్ మూమెంట్/ ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటలోనే గ్రామానికి చెందిన ఒకే ఒక వ్యక్తి బ్రతికినట్లు సమాచారం.

సూడాన్ గత కొద్దిరోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే మర్రా పర్వతప్రాంతంలో కొండచరియలు గ్రామంపై విరుచుకుపడ్డాయి. వెంటనే అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి సహకారం అందించాలని సూడాన్ కోరుతోంది.

సూడాన్ లో ప్రస్తుతం అంతర్యుద్దం కొనసాగుతోంది... సైన్యానికి, పారామిలటరీ దళాలకు మధ్య వివాదం కొనసాగుతోంది. దీంతో సామాన్య ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు... తమను తాము రక్షించుకునేందుకే చాలామంది ఈ మర్రా పర్వతప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇలాంటివారితో ఏర్పడిన గ్రామంలోనే తాజాగా ప్రమాదం జరిగింది... ప్రాణాలు కాపాడుకుందామని వచ్చినవారిని ప్రకృతి విపత్తు ప్రాణం తీసింది.

Scroll to load tweet…