Sudan conflict: ఆకలితో 60 మంది చిన్నారులు మృతి..
Sudan conflict: సూడాన్ లో కొనసాగుతున్న అంతర్గత ఘర్షణల కారణంగా ఖార్టూమ్ అనాథాశ్రమంలో 60 మంది చిన్నారుల మృతి చెందారు. వీరిలో శిశువులు, పసిబిడ్డలు, పెద్ద పిల్లలు ఆహారం లేకపోవడంతో ఆరోగ్యం క్షీణించిన పరిస్థితులలో చిక్కుకున్నప్పుడు జ్వరంతో మరణించారని ఆ సూడాన్ దేశ రిపోర్టులు పేర్కొంటున్నాయి.

60 children die in Khartoum orphanage: సూడాన్ లో కొనసాగుతున్న సంక్షోభం మరింతగా ముదురుతోంది. ప్రజల పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. సూడాన్ లో కొనసాగుతున్న అంతర్గత ఘర్షణల కారణంగా ఖార్టూమ్ అనాథాశ్రమంలో 60 మంది చిన్నారుల మృతి చెందారు. వీరిలో శిశువులు, పసిబిడ్డలు, పెద్ద పిల్లలు ఆహారం లేకపోవడంతో ఆరోగ్యం క్షీణించిన పరిస్థితులలో చిక్కుకున్నప్పుడు జ్వరంతో మరణించారని ఆ సూడాన్ దేశ రిపోర్టులు పేర్కొంటున్నాయి.
వివరాల్లోకెళ్తే.. సూడాన్ లో సైన్యం-పారామిలిటరీ బలగాలకు మధ్య కొనసాగుతున్న ఘర్షణల కారణంగా దేశంలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఈ ఆధిపత్య పోరు సూడాన్ లో చిన్నారుల పాలిట శాపంగా మారింది. తినడానికి తిండిలేని పరిస్థితులు మధ్య 60 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సూడాన్ రాజధాని ఖార్టూమ్ లోని ఓ అనాథాశ్రమంలో గత ఆరు వారాలుగా 60 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తిండి లేక, జ్వరంతో చనిపోయారు. వారాంతంలో రెండు రోజుల్లో 26 మంది చనిపోయారు.
ఖార్టూమ్ లోని అల్-మేకోమా అనాథాశ్రమంలో డజనుకు పైగా వైద్యులు, వాలంటీర్లు, ఆరోగ్య అధికారులు, కార్యకర్తలతో జరిపిన మీడియా ముఖాముఖి సంభాషణలతో పిల్లల బాధల తీవ్రత బయటపడింది. అసోసియేటెడ్ ప్రెస్ ఈ కేంద్రంలో క్షీణిస్తున్న పరిస్థితులను చూపించే డజన్ల కొద్దీ డాక్యుమెంట్లు, చిత్రాలు, వీడియోలను కూడా సమీక్షించింది. అనాథాశ్రమ కార్మికులు తీసిన వీడియోలో పిల్లల మృతదేహాలను తెల్లని షీట్లలో కట్టి ఖననం కోసం ఎదురు చూస్తున్నారు. మరో ఫుటేజీలో, కేవలం న్యాపీలు మాత్రమే ధరించిన రెండు డజన్ల మంది పసిబిడ్డలు ఒక గదిలో నేలపై ఉన్నారు. వారిలో చాలా మంది ఏడుస్తున్నారు, ఒక మహిళ రెండు లోహపు జగ్గులు నీటిని తీసుకువెళుతోంది. మరో మహిళ నేలపై కూర్చొని తన బిడ్డను ఎత్తుకుని అటూ ఇటూ ఊపుతూ కనిపించింది.
శుక్రవారం 14 మంది, శనివారం మరో 12 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇది సోషల్ మీడియాలో ఆందోళనను , ఆగ్రహాన్ని రేకెత్తించింది. స్థానిక స్వచ్ఛంద సంస్థ ఆదివారం అనాథాశ్రమానికి ఆహారం, మందులు, బేబీ ఫార్ములాను అందించగలిగింది. ఐక్యరాజ్యసమితి పిల్లల ఏజెన్సీ, యునిసెఫ్-ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ సహాయంతో చర్యలు చేపట్టింది. మరింత మంది పిల్లలు చనిపోయే అవకాశం ఉందనీ, యుద్ధంతో అతలాకుతలమైన ఖార్టూమ్ నుంచి వారిని త్వరగా ఖాళీ చేయించాలని అనాథాశ్రమ సిబ్బంది హెచ్చరించారు. కాగా, ఏప్రిల్ 15 న ప్రత్యర్థి సైనిక వర్గాల మధ్య చెలరేగిన పోరాటం ఖర్టూమ్ సహా ఇతర పట్టణ ప్రాంతాలను యుద్ధభూమిగా మార్చింది.
ఈ పోరులో పౌరులు, ముఖ్యంగా చిన్నారులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. కనీసం 860 మంది పిల్లలతో సహా 190 మందికి పైగా పౌరులు మరణించారని, వేలాది మంది గాయపడ్డారని పౌరుల మరణాలను ట్రాక్ చేసే సూడాన్ డాక్టర్స్ సిండికేట్ తెలిపింది. ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 1.65 మిలియన్లకు పైగా ప్రజలు సూడాన్ లోని సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. మరికొంత మంది దేశం విడిచి పారిపోయారు. యునిసెఫ్ ప్రకారం, సూడాన్ లో 13.6 మిలియన్లకు పైగా పిల్లలకు అత్యవసర మానవతా సహాయం అవసరంగా ఉంది. అయితే ఇది యుద్ధానికి ముందు దాదాపు 9 మిలియన్లుగా ఉంది.