పొందగటాన్ కు తూర్పు దిక్కుగా 63 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. ఈ విషయాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఫిలిప్పీన్స్ లో భూకంపం సంభవించింది. ఫిలప్పీన్స్ లోని పొందగిటాన్ లో ఈ భూకంపం సంభవించడం గమనార్హం. ఇది రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రత నమోదైంది. పొందగటాన్ కు తూర్పు దిక్కుగా 63 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. ఈ విషయాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
65.6 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. మరోవైపు యూఎస్ సునామీ హెచ్చరిక కేంద్రం ఫిలిప్పీన్స్ కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఫిలప్పీన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వోల్కానాలజీ, సిస్మాలజీ భూకంప నష్టాన్ని అంచనా వేశాయి.
