Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద విమానం.. ఎగిరిందోచ్

ప్రపంచంలో కెల్లా అతి పెద్ద విమానం తొలిసారిగా గాలిలోకి ఎగిరింది.  మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ ఆల్లెన్ 2011లో స్థాపించిన స్ట్రాటోలాంచ్ కంపెనీ ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారుచేసింది.

Stratolaunch Flies World's Largest Plane for the First Time
Author
Hyderabad, First Published Apr 15, 2019, 3:18 PM IST

ప్రపంచంలో కెల్లా అతి పెద్ద విమానం తొలిసారిగా గాలిలోకి ఎగిరింది.  మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ ఆల్లెన్ 2011లో స్థాపించిన స్ట్రాటోలాంచ్ కంపెనీ ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారుచేసింది.ఉపగ్రహాలకు ఫ్లయింగ్ లాంచ్‌ప్యాడ్‌లా పని చేయడానికి ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందించారు. అయితే, ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ముందు 10 కి.మీ. దూరం విమానాన్ని నడిపారు. ఈ విమానం బరువు 2లక్షల 26వేల కేజీలు.

మొజావే విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకొని సుమారు రెండు గంట్లో ఈ విమానం కాలిఫోర్నియాకు చేరుకుంది. భూమికి దాదాపు 17వేల అడుగుల్లో గంటకు 304కిలోమీటర్ల వేగంతో ఈ విమానం ప్రయాణిస్తుంది.దీని రెక్కల పొడవు 385 అడుగులు. అంటే... అమెరికాలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ విస్తీర్ణం కంటే ఎక్కువని చెప్పొచ్చు.

వచ్చే సంవత్సరం ఈ విమానం ఉపయోగించి మొట్టమొదటి శాటిలైట్ ని ఆర్బిట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆరు ఇంజన్లు, రెండు విమాన బాడీలు కలిగిన ఇది మ్యాగ్జిమం 35 వేల అడుగులు ఎగరగలదు. 

Follow Us:
Download App:
  • android
  • ios