ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ కు ఓ సమావేశంలో వింత అనుభవం ఎదురైంది. ఉద్యోగులతో సమావేశం నిర్వహించి స్వయంగా మాట్లాడటం ప్రారంభించగానే ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. 

ప్రపంచ వ్యాపార కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన నాటి నుంచి వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఆయన తీసుకున్న పలు నిర్ణయాలపై వివాదాలు కూడా తలెత్తాయి. వచ్చి రాగానే వందలాది మంది ఉద్యోగులకు వీడ్కోలు చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. కొన్ని రోజుల పాటు ట్విట్టర్ కార్యాలయ భవనాన్ని మూసివేస్తున్నట్లు ఉద్యోగులకు మెయిల్స్ పంపించారు. దీంతో చాలా మంది ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్లిపోయారు.

తల్లి ప్రేమ...పుట్టిన బిడ్డను చూసి చింపాంజీ ఎమోషనల్.. వీడియో వైరల్..!

తాజాగా మస్క్ ఉద్యోగులకు ట్విట్టర్‌ను విడిచిపెట్టాలనుకుంటున్నారా లేదా కంపెనీతో ఉండాలనుకుంటున్నారా అనే విషయాన్ని నిర్ణయించడానికి గురువారం సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చాడు. దీంతో వందలాది మంది ఉద్యోగులు కంపెనీకి నుంచి వెళ్లిపోయి మూడు నెలలపాటు పరిహారం తీసుకోవాలని నిర్ణయించుకున్నారని ‘న్యూయార్క్ టైమ్స్’ నివేదించింది. మస్క్ బృందం ట్విటర్ కార్యకలాపాలకు కీలకంగా భావించే ఉద్యోగులతో సమావేశాలు కూడా నిర్వహించింది. వారిని అక్కడే ఉండేలా ఒప్పించేందుకు ప్రయత్నించింది.

పరువు హత్య : చంపి, జననాంగాలు కోసి.. రాజస్థాన్ లో జంట దారుణ హత్య..

అయితే ఇలాంటి సమావేశమే ఒకటి గురువారం జరిగింది. ఇందులో కొంత మంది ఉద్యోగులు రష్యాలోని శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో కాన్ఫరెన్స్ కాల్‌లో ఉండగా.. మరికొందరు వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా కనెక్ట్ అయ్యారు. అయితే సాయంత్రం 5 గంటల సమయంలో ఎలాన్ మస్క్ స్వయంగా సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరుగా వెళ్లిపోవడం ప్రారంభించారు. తరువాత వారందరూ ట్విట్టర్ నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నారు. కాగా.. గత కొన్ని వారాలుగా మస్క్ తరచుగా తనపై బహిరంగ ట్వీట్ల ద్వారా నిరసన తెలిపే వారిని, అలాగే తన నిర్ణయాలతో విభేదించే వారిన తొలగిస్తున్నారు. 

కదులుతున్న కారులో మోడల్ పై గ్యాంగ్ రేప్, మహిళతో సహా నలుగురి అరెస్ట్..

అయితే ఇలా ట్విట్టర్ నుంచి వెళ్లిపోయిన వ్యక్తులను ఉద్దేశించి మస్క్ మాట్లాడుతూ.. తాను కంపెనీ భవిష్యత్తు గురించి తాను పెద్దగా ఆందోళన చెందడం లేదని అన్నారు. తన కంపెనీలో ఉత్తమమైన వ్యక్తులు ఉన్నారని చెప్పారు. అందువల్ల ట్విట్టర్ కంపెనీ మూసివేతకు గురి కాదని అన్నారు. ఓ ట్విట్టర్ వినియోగదారుడు ట్వీట్ ద్వారా అడిగిన ప్రశ్నకు ఆయన సమధానం ఇచ్చారు. కాగా.. ట్విట్టర్ కూడా తన కార్యాలయ భవనాలను సోమవారం వరకు మూసి ఉంచుతుందని, ఉద్యోగులను లోపలికి అనుమతించబోమని ఇమెయిల్ ద్వారా ప్రకటించింది. దీంతో పాటు కొంతమంది ముఖ్యమైన ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టకుండా నిరోధించడానికి మస్క్, ఆయన సలహాదారులు సమావేశాలు నిర్వహిస్తారని పేర్కొంది.