Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగే విమానాన్ని దొంగిలించాడు: కుప్పకూలింది

అలస్కా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాన్ని సంస్థ ఉద్యోగి దొంగిలించాడు. అయితే, అది సియాటిల్ సీ - టాక్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం కూలిపోయింది. 

Stolen Alaska Airlines plane crashes near Sea-Tac International Airport
Author
Seattle, First Published Aug 11, 2018, 11:53 AM IST

సియాటిల్: అలస్కా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాన్ని సంస్థ ఉద్యోగి దొంగిలించాడు. అయితే, అది సియాటిల్ సీ - టాక్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం కూలిపోయింది. 

హారిజోన్ ఎయిర్ క్యూ400 విమానాన్ని ఎయిర్ లైన్ ఉద్యోగి దొంగిలించాడని, శుక్రవారం అనధికారికంగా టేకాఫ్ తీసుకున్న తర్వాత కూలిపోయిందని సీ - టాక్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు చెప్పారు. 

హారీజోన్ ఎయిర్ క్యూ400 విమానం అనధికారిక టేకాఫ్ జరిగిందని అంతకు ముందు అలస్కా ఎయిర్ లైన్స్ ట్వీట్ చేసింది. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులెవరూ లేరు. 

విమానం దొంగతనం జరిగిన వెంటనే దాన్ని కనిపెట్టడానికి ఎఫ్ - 15 మిలిటరీ జెట్స్ రంగంలోకి దిగాయి. రెండు మిలిటరీ ఎఫ్ -15లు ఆ విమానాన్ని వెంటాడాయి. అయితే, ఈ విమానాలు సురక్షితంగానే ఉన్నాయి. 

దొంగతనానికి గురైన విమానం కెట్రోన్ దీవిలో కూలిపోయింది. ఆకాశంలో విమానం స్టంట్స్ చేయడం వల్ల లేదా ఫ్లయింగ్ స్కిల్స్ లోపించడం వల్ల విమానం కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios