కరోనా దెబ్బ: అమెరికాలో చిక్కుకొన్న 2.5 లక్షల ఇండియన్ స్టూడెంట్స్

 అమెరికాలో ఉన్న  ఇండియన్ విద్యార్థులపై  కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. తమను ఇండియాకు రప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని విద్యార్థులు భారత రాయబారిని కోరారు. అయితే ఎక్కడి వారు అక్కడే ఉండాలని విద్యార్థులను ఆదేశించారు దౌత్య అధికారులు.
 
Stay where you are: Ambassador Sandhu tells stranded Indian students in US
వాషింగ్టన్:  అమెరికాలో ఉన్న  ఇండియన్ విద్యార్థులపై  కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. తమను ఇండియాకు రప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని విద్యార్థులు భారత రాయబారిని కోరారు. అయితే ఎక్కడి వారు అక్కడే ఉండాలని విద్యార్థులను ఆదేశించారు దౌత్య అధికారులు.

అమెరికాలోని పలు విద్యాసంస్థలు, యూనివర్శిటీల్లో  సుమారు రెండున్నర లక్షల మంది ఇండియాకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. కరోనా వైరస్ ప్రభావం అమెరికాలో తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా సుమారు 20 వేల మంది మృతి చెందారు. అంతేకాదు వేలాది మంది ఈ వైరస్ బారినపడ్డారు.

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున పలు యూనివర్శిటీలు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. దరిమిలా యూనివర్శిటీలు విద్యాసంస్థలకు అనుబంధంగా ఉన్న హాస్టళ్లను కూడ మూసివేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

అమెరికాలో ఉంటున్న విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో తమను ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఇండియన్ విద్యార్థులు భారత రాయబారితో వీడియో కాల్ లో మాట్లాడారు. 
Also read: కరోనా : చికాగో జైలు నుండి ఖైదీలను మరో జైలుకు తరలింపును తిరస్కరించిన జడ్జి

అయితే అమెరికాలో పరిస్థితులు ప్రస్తుతం ఇబ్బందికరంగా ఉన్నాయని అమెరికాలో భారత రాయబారి విద్యార్థులకు చెప్పారు. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని అధికారులు విద్యార్థులకు సూచించారు.

అమెరికాలో కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఇండియాకు వచ్చేందుకు చర్యలు తీసుకొంటామని భారత రాయబారి విద్యార్థులకు సూచించారు. మరో వైపు వీసా గడువు ముగిసిన వారికి వీసా గడువును పొడిగించాలని కూడ కొందరు విద్యార్థులు భారత రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. వీసా గడువు ముగిసినవారికి వీసా గడువును పొడిగించేలా చర్యలు తీసుకొంటామని భారత రాయబారి విద్యార్థులకు హామీ ఇచ్చారు.
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios