Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్‌లో నిరుద్యోగులతో నిండిన స్టేడియం.. పోలీసు రిక్రూట్‌మెంట్ టెస్టుకు హాజరు.. వైరల్ వీడియో ఇదే

పాకిస్తాన్‌లో నిరుద్యోగులతో ఓ స్టేడియం నిండిపోయింది. పోలీసు శాఖలో 1,167 పోస్టుల భర్తీ కోసం చేపట్టిన రిక్రూట్‌మెంట్‌లో సుమారు 30 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిని ఓ స్టేడియంలో కూర్చోబెట్టి పరీక్ష రాయించారు.
 

stadium full of unemployees in pakistan as they attend to write police recruitment drive viral video
Author
First Published Jan 2, 2023, 2:48 PM IST

న్యూఢిల్లీ: క్రికెట్, క్రీడలు, కాన్సర్ట్‌లు ఇతర కార్యక్రమాలకు స్టేడియాలు ఫుల్‌గా నిండిపోయి ఉండటాన్ని మనం చూస్తాం. కానీ, పాకిస్తాన్‌లో ఓ విచిత్ర కారణంతో స్టేడియం మొత్తం నిండిపోయింది. పోలీసు రిక్రూట్‌మెంట్ టెస్టు కోసం నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారందరికీ ఓ స్టేడియంలో టెస్టు పెట్టారు. దీంతో ఇస్లామాబాద్ నగరంలోని ఆ స్టేడియం మొత్తం నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అల్ జజీరా ఈ వీడియోను రిపోర్ట్ చేసింది. పాకిస్తాన్‌లో నెలకొని ఉన్న నిరుద్యోగాన్ని ఈ వీడియో వెల్లడిస్తున్నది. అభ్యర్థులు పెన్నులు, నోట్‌ప్యాడ్‌లతో విద్యార్థులు కనిపించారు. వారంతా నవ్వుతూ తుళ్లుతూ తమ పరీక్షకు హాజరయ్యారు.

పోలీసు శాఖలో 1,167 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టింది. ఈ పరీక్ష రాయడానికి సుమారు 30 వేల మంది హాజరయ్యారు.

పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ (పీఐడీఈ) ప్రకారం, దేశంలోని 31 శాతం యువత నిరుద్యోగులుగా ఉన్నారు. అంతేకాదు, చాలా మంది యువతకు ఉద్యోగాలు లేవు. వారు ఎప్పుడు తమ పనులు మానుకుందామా? అని ఉన్నవాళ్లున్నారు. ఇతరత్ర ఆదాయాల మీద బతికే వారూ ఉన్నారని వివరించింది. 

Also Read: పాకిస్థాన్ న్యూ ఇయర్ వేడుకల్లో కాల్పులు.. 22 మందికి గాయాలు

యువతలో మెజార్టీ ప్రొఫెషనల్ డిగ్రీలు కలిగి ఉన్నారని, ఏఎన్ఐ ప్రకారం, పాకిస్తాన్ జనాభాలో 30 ఏళ్ల వయసులోపే ఉన్నవారు 60 శాతం మంది.

కాగా, ఈ పోలీసు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌లో నిరుద్యోగంపై చర్చ మొదలైంది.

Follow Us:
Download App:
  • android
  • ios