Asianet News TeluguAsianet News Telugu

మస్క్ తో పనిచేస్తానన్న భారత టెక్ ధిగ్గజం: ఎవరీ శ్రీరామ్ కృష్ణన్

ఇండియాకు  చెందిన  శ్రీరామ్ కృష్ణన్  ఎలాన్ మస్క్ కు సహాయం  చేస్తానని  ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన ప్రస్తుతం  ఆసక్తికరంగా మారింది.

 Sriram Krishnan temporarily assisting Elon Musk with Twitter
Author
First Published Oct 31, 2022, 8:28 PM IST

న్యూఢిల్లీ: భారత్  కు చెందిన శ్రీరామ్ కృష్ణన్ ఎాన్ మస్క్ కు  సహాయం చేస్తానని  ప్రకటించడంపై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ట్విట్టర్ నుండి పరాగ్ బయటకు వెళ్లిపోవడంతో  భారత్ కు చెందిన శ్రీరామ్  ఆ బాధ్యతలు చేపడుతారా అనే చర్చ కూడ లేకపోలేదు.

 తమిళనాడు రాష్ట్రంలోని చెన్నెలో కృష్ణన్  జన్మించాడు. ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్  కాలేజీలో ఇన్మర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్  డిగ్రీని పొందాడు. తన భార్య ఆర్ది రామమూర్తిని ఇదే కాలేజీలో ఇదే కాలేజీలో ఆయన  కలుసుకున్నాడు.2005లో  అతను పట్టభద్రుడయ్యాడు.ఆ  తర్వాత శ్రీరామ్ అమెరికాకు వెళ్లాడు.

 

2007లో మైక్రోసాఫ్ట్  లో  విజువల్ స్టూడియో ప్రోగ్రామ్ మేనేజర్  గా  పనిచేశారు. ఆ తర్వాత ేస్ బుక్ కి మారాడు. ఫేస్ బుక్ కు ఆడియన్స్  రాబట్టడంతో కీలకంగా  వ్యవహరించాడు.  స్నాప్ చాట్ తో కూడ ఆయన పనిచేశాడు.సిలికాన్ వ్యాలిలోని ప్రముఖ కంపెనీలలో  ఆయన పనిచేశాడు .ఆ తర్వాత ఆయన  ట్విట్టర్ కు  మారాడు.ట్విట్టర్ లో  సీనియర్ ప్రొడక్ట్ డైరెక్టర్ గా పని చేశాడు. 2021లో కృష్ణన్  అతిన భార్య ఆర్తి రామ్మూర్తి  స్టర్టప్  లపై ఆర్గానిక్ సంభాషణలపై దృష్టి సారించే క్లబ్ హౌస్ టాక్ షోను ప్రారంభించారు.

Follow Us:
Download App:
  • android
  • ios