ఎలాన్ మస్క్ SpaceX Company లో లైగింక వేధింపులకు గుర‌య్యాన‌ని  ఆ సంస్థ మాజీ మ‌హిళ ఉద్యోగిని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ప‌ని ప్రాంతాల్లో కొందరు తనను అనుచితంగా తాకేవార‌నీ, ఈ విషయాన్ని హెచ్ ఆర్ విభాగానికి తీసుకెళ్లినా..ఎటువంటి ప్రయోజనం లేదని వాపోయింది. ఈ ఒత్తిడి వాతావరణంలో ఇమడలేకే తాను బయటకు వచ్చేశానని చెప్పుకొచ్చింది. 

Elon Musk SpaceX: టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్.. పరిచ‌యం అవ‌స‌రం లేని పేరు. అటు విద్యుత్ వాహనాలు, ఇటు అంతరిక్ష యాత్రలు, పరిశోధనలతో దూసుకుపోతున్నాడు. ఆయ‌న ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా SpaceX ప్రాజెక్ట్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. భూమి మీద ఏదైనా ప్రమాదం జరిగి, భూమి మీద మనుగడ అంతరించి పోతే.. మానవుడు మార్స్‌ మీద జీవించడానికి ఉప‌యోగప‌డాల‌నే లక్ష్యంతోనే ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ ముందుకు సాగుతుంది. 

ఇదిలా ఉంటే.. Elon Musk SpaceX లో లైంగిక వేధింపులు ఎదురైన‌ట్టు ముగ్గురు మాజీ మహిళా ఉద్యోగులు ఆరోప‌ణ‌లు చేశారు. ఆ విష‌యంలో కంపెనీ యాజ‌మాన్యానికి ఫిర్యాదు చేసినా.. నిందితులపై కంపెనీ చర్యలు తీసుకోలేదని బాధిత మహిళ ఆరోపించింది. అమెరికాలోని మస్క్‌కి చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా లో తాము లైంగిక వేధింపుల‌కు గురయ్యామ‌ని ఆరుగురు మహిళలు ఉద్యోగులు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో స్పేస్‌ఎక్స్‌లో కూడా లైంగిక వేధింపు జ‌రుగుతున్నాయ‌ని ఆరోప‌ణ‌లు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. 

Read Also : చరిత్రలో తొలిసారి.. సూర్యుడిని తాకిన‌ నాసా అంతరిక్ష నౌక.. మూడేళ్ల తర్వాత..

Elon Musk SpaceX సంస్థలోని వాతావరణం నచ్చక తాను రాజీనామా చేశానంటూ స్పేస్‌ఎక్స్ ను బ‌య‌టకు వ‌చ్చినా.. ఒక మాజీ ఉద్యోగి యాష్లే కొసాక్.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. స్పేస్ ఎక్స్ లో త‌న‌కు, త‌న స‌హాచ‌రులకు ఎదురైనా.. అనుభవాలను తెలుపుతూ.. వెబ్‌సైట్‌లో కథనం రాశారు. తాను ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్‌లో బిల్డ్ రిలయబిలిటీ ఇంజనీర్‌గా పనిచేశాన‌ని , ఆ స‌మ‌యంలో త‌న మ‌గ స‌హోద్యోగుల నుంచి తాను , త‌న స్నేహితురాలు లైంగిక వేధింపుల‌కు గుర‌య్యామ‌ని తెలిపింది.

Read Also : Omicron New Symptoms : రాత్రుళ్లు విపరీతమైన చెమట.. ఈ లక్షణం కనిపిస్తే అశ్రద్ధ చేయద్దు..

ఈ విష‌యంలో అనేక సార్లు SpaceX HR కి ఫిర్యాదులు చేసినప్పటికీ, విషయాన్ని పట్టించుకోలేదని కూడా ఆమె త‌న వ్యాసంలో రాసుకోచ్చింది. మిగతా నలుగురు మాజీ ఉద్యోగులకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు.2017లో తాను భోజనం చేస్తున్నప్పుడు ఒక సహోద్యోగి తన‌తో అనుచితంగా ప్రవర్తించాడని, అలాగే.. 2018లో మరో సహోద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె వివరించింది.

Read Also : కఠినమైన పొరుగువారి మధ్యలో భారత్ ఉంది.. భారత రాయబారిగా నామినేట్ అయిన ఎరిక్ మైఖేల్

SpaceX సంస్థ.. లైంగిక వేధింపుల చర్యలకు పాల్పడిన వ్యక్తులపై స‌రైనా చ‌ర్య‌లు తీసుకోలేద‌ని, ఉద్యోగుల శ్రేయ‌స్సు కాకుండా.. మిషన్‌కు మాత్ర‌మే అధిక ప్రాధాన్యమిస్తోంద‌ని మాజీ ఉద్యోగి ఆరోపించింది. ఇలాంటి విష‌యాల్లో కంపెనీ చ‌ర్య తీసుకుంటే.. బహుశా ప్రాజెక్టు మీద ప్ర‌భావం చూపుతుంద‌ని SpaceX మేనేజ్‌మెంట్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని భావిస్తోన్నామన్నారు. తాను రాస్తున్న వ్యాసం ద్వారా.. SpaceX లో జ‌రుగుతున్న విష‌యాలు వెలుగులోకి రావ‌డానికి సహాయపడుతుందని తాను ఆశిస్తున్నానని తెలిపింది. 

SpaceXలో గ‌త ఐదు సంవత్సరాలుగా ఇలాంటి ఆరోప‌ణ‌లు త‌మ దృష్టికి రాలేద‌నీ, త‌మ‌కు ఇలాంటి అలాంటి అనుభవం లేదని చెప్పింది. ఈ ఆరోపణలపై SpaceX ఇంకా స్పందించలేదు. శనివారం ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో, SpaceX ప్రెసిడెంట్ మరియు COO గ్విన్ షాట్‌వెల్ చెప్పారు.