జోహాన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనాను శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రిటన్ లో గుర్తించిన కరోనా కంటే దక్షిణాఫ్రికాలోని వైరస్ అత్యంత ప్రమాదకరమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దక్షిణాఫ్రికాలో గుర్తించిన కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది.ఈ వైరస్ యువతలోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని నిపుణుల బృందం తేల్చింది.దక్షిణాఫ్రికాలో గుర్తించిన కొత్త కరోనాకు 501 డాట్ వీ 2 గా పేరు పెట్టారు.

దక్షిణాఫ్రికా నుండి బ్రిటన్ కు అన్ని రకాల విమానాలను రద్దు చేశారు. దక్షిణాఫ్రికాలో లాక్‌డౌన్ విధించే దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

కరోనాకు ప్రపంచంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇండియాలో ఈ నెల 13వ తేదీ నుండి ఈ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభించనుంది.

కరోనా రోజు రోజుకి రూపాంతరం చెందుతోంది. బ్రిటన్ లో గత ఏడాది స్ట్రెయిన్ ను గుర్తించారు. దీని గురించి ఆందోళన చెందుతున్న తరుణంలోనే దక్షిణాఫ్రికాలో  కొత్త రకం వైరస్ ను గుర్తించడం కలకలం రేపుతోంది.