Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..

'వరల్డ్‌వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే' నివేదిక ప్రకారం.. సింగపూర్, న్యూయార్క్ సంయుక్తంగా అత్యంత ఖరీదైన నగరాల్లో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ ఏడాది ప్రపంచంలోని 172 ప్రధాన నగరాల్లో సగటు జీవన వ్యయం 8.1 శాతం పెరిగింది. ఉక్రెయిన్‌లోని యుద్ధం,సరఫరా గొలుసులపై కూడా కోవిడ్ ప్రభావం చూపిందని నివేదికలో ప్రస్తావించబడింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాను ఎకనమిస్ట్‌ ఇంటిలిజెన్స్‌ యూనిట్‌ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. 

Singapore and New York on top of the worlds most expensive cities,
Author
First Published Dec 2, 2022, 3:16 PM IST

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏది?  ప్రతి ఏటా ఈ ప్రశ్నకు ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) అనే సంస్థ సమాధానం ఇస్తోంది . అదే విధంగా ఈ ఏడాది (2022) కూడా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఈ సంస్థ విడుదల చేసిన జాబితా ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో న్యూయార్క్​, సింగపూర్‌ తొలి స్థానంలో నిలిచాయి. వరల్డ్‌వైడ్‌ కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ రిపోర్ట్‌ ఆధారంగా ఈ సంస్థ నివేదికను  రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని 172 ప్రధాన నగరాల్లో జీవన వ్యయం గత సంవత్సరంలో సగటున 8.1శాతం పెరిగింది. ఉక్రెయిన్‌లో యుద్ధం, సరఫరా-గొలుసు ధ్వంసం ఇందుకు ప్రధాన కారణం. 

గతేడాది విడుదలైన అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో తొలి స్థానంలో నిలిచిన ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరం ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. ఇక హాంగ్​కాంగ్​, లాస్​ఏంజెల్స్​  లు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ ఆరో స్థానం, జెనీవా (స్విట్జర్లాండ్‌) ఏడో స్థానం, శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా) ఎనిమిదో స్థానం, ప్యారిస్‌ (ఫ్రాన్స్‌) తొమ్మిదో స్థానం, డెన్మార్క్‌లోని కోపెన్‌హ్యాగెన్‌, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం పదో స్థానంలో నిలిచాయి. ఇక.. సిరియా రాజధాని డమాస్కస్‌, లిబియాలోని ట్రిపోలి.. ప్రపంచంలోనే అతి చవుగా( చీపెస్ట్)‌ నగరాలు అని పేర్కొంది. న్యూయార్క్,  సింగపూర్ వంటి నగరాలు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాయని, ఈ నగరాల అందాలను చూసేందుకు ఏడాది పొడవునా పర్యాటకులు ఆసక్తి చూస్తున్నారని, పర్యటకులు ఎక్కువగా దర్శించే నగరాల్లో ఈ నగరాలు ఎప్పుడు టాప్ ఫ్లేస్ లోనే ఉంటున్నాయని నివేదిక వెల్లడించింది. 

గత ఏడాది ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టెల్‌ అవీవ్‌ మూడో స్థానానికి పడిపోగా, అలాగే..  హాంకాంగ్‌, లాస్‌ ఏంజెల్స్‌ ల ర్యాంకులు కూడా తమ నగరాల్లో టాప్‌-5 ర్యాంకుల్లోకి చేరుకున్నాయి. ప్రభుత్వ విధానాలు, కరెన్సీ పతనం  కారణంగా దేశ వ్యక్తిగత పనితీరులో కూడా మార్పు వచ్చింది.  

మాస్కో ర్యాంకింగ్‌లో భారీ మార్పు

రష్యా-ఉక్రెయిన్ ల యుద్దం, కోవిడ్ వల్ల  రష్యా రాజధాని మాస్కో ర్యాంకింగ్ పడిపోయింది. గత ఏడాది ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టెల్‌ అవీవ్‌ మూడో స్థానానికి పడిపోగా, అలాగే..  హాంకాంగ్‌, లాస్‌ ఏంజెల్స్‌ ల ర్యాంకులు కూడా తమ నగరాల్లో టాప్‌-5 ర్యాంకుల్లోకి చేరుకున్నాయి. ప్రభుత్వ విధానాలు, కరెన్సీ పతనం  కారణంగా దేశ వ్యక్తిగత పనితీరులో కూడా మార్పు వచ్చింది. రష్యా రాజధాని మాస్కో , ఆస్ట్రేలియా నగరం సెయింట్ పీటర్స్‌బర్గ్‌ల ర్యాంకింగ్‌లో అతిపెద్ద మార్పు జరిగింది. విపరీతమైన ద్రవ్యోల్బణం పరంగా, రెండింటి ర్యాంకింగ్‌లు వరుసగా 88,70 స్థానాల్లో నిలిచాయి.  

ప్రపంచంలో అత్యంత ఖరీదైన 10 నగరాలు

1. న్యూయార్క్
1. సింగపూర్
3. టెల్ అవివ్
4. హాంకాంగ్
4. లాస్ ఏంజిల్స్
6. జ్యూరిచ్
7. జెనీవా
8. శాన్ ఫ్రాన్సిస్కో
9. పారిస్
10. సిడ్నీ
10. కోపెన్‌హాగన్

ప్రపంచంలోని 10 చౌకైన నగరాలు

161. కొలంబో
161.  బెంగళూరు
161. అల్జీర్స్
164. చెన్నై
165. అహ్మదాబాద్
116. అల్మాటీ
167. కరాచీ
168. తాష్కెంట్
169. ట్యూనిస్
170. టెహ్రాన్
171. ట్రిపోలీ
172. డమాస్కస్‌

టాప్ 100లో భారతీయ నగరం ఏదీ లేదు.. 

172 నగరాల జాబితాలో మూడు భారతీయ నగరాలు చేర్చబడినప్పటికీ..  భారతదేశంలోని ఏ నగరం కూడా టాప్ 100లో చేర్చబడలేదు. పెరుగుదలను నివారించే ధోరణి కారణంగా..  ఆసియా నగరాల్లో జీవన వ్యయం సగటున కేవలం 4.5% మాత్రమే పెరిగిందని నివేదిక పేర్కొంది. ప్రభుత్వ విధానాలు, కరెన్సీ కదలికల కారణంగా పనితీరు దేశం నుండి దేశానికి మారుతూ ఉంటుంది. ఈ జాబితాలో భారతదేశంలోని మూడు నగరాలు చేర్చబడ్డాయి.బెంగళూరు 161వ స్థానంలో, చెన్నై 164వ స్థానంలో, అహ్మదాబాద్ 165వ స్థానంలో నిలిచింది. 

Follow Us:
Download App:
  • android
  • ios