మెక్సికోలో కాల్పుల ఘటన కలకలం రేపింది. నైట్ క్లబ్ లో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు.  

మెక్సికో : మొన్నటి వరకు అమెరికాను వణికించిన వరుస కాల్పుల ఘటనలు ప్రస్తుతం మెక్సికోను వణికిస్తున్నాయి. మెక్సికోలోని జెరెజ్ టౌన్ లో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడి ఓ నైట్ క్లబ్ లో సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ముందస్తుగా గానే కాల్పులకు ప్రణాళిక వేసుకున్నట్టుగా ఘటన జరిగిన విధానాన్ని బట్టి తెలుస్తోందని సమాచారం. ఘటన జరిగిన ఎల్ వానాడిటో నైట్ క్లబ్ కు చేరుకున్నారు. పెద్దసంఖ్యలో ఆయుధాలతో దుండగులు రెండు వాహనాల్లో చేరుకున్నారు. అక్కడున్న వారిమీద వెంటనే కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ మేరకు పోలీసులు వివరాలు తెలియజేశారు. 

పలువురు గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ క్షతగాత్రుల్లో ఇద్దరు మృతి చెందారు. సంగీత కళాకారులు, క్లబ్ కు వచ్చే కస్టమర్లు, క్లబ్ ఉద్యోగులు గాయపడిన వారిలో ఉన్నారని పోలీసులు తెలిపారు.