అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతసంతతికి చెందిన కమలా హ్యారిస్ విజయం భారతీయులకూ ఎంతో సంతోషాన్ని కలిగించింది. అగ్రదేశానికి మొట్ట మొదటి మహిళా వైస్ ప్రెసిండెంట్ అవ్వడంతో భారత్ నుంచి ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నేపధ్యంతో బాలీవుడ్ సెలబ్రిటీలు ఎందరో ఆమెకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే నటుడు, రాజకీయనాయకుడు అయిన శత్రుఘ్నసిన్హా ఓ ఫొటోను షేర్ చేస్తూ మరీ తన అభినందనలు పంచుకున్నారు. 

శతృఘ్న సిన్హా తన సోదరుడు  లఖన్ సిన్హా కుమార్తె ప్రీతీ సిన్హా కమలా హ్యారీస్ కు బాగా దగ్గర అని చెబుతూ ఒక ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో కమలా హ్యారిస్... ప్రీతి సిన్హా పక్కపక్కనే నిలుచుని కనిపిస్తున్నారు.

ఈ ఫొటోతో పాటు కమలాహ్యారిస్ ను ఉద్దేశించి 'హృదయపూర్వక అభినందనలు! జోబైడెన్ తో కలిసిి మీరు అద్భుతమైన, అత్యంత అర్హమైన విజయాన్ని సాధించారు. ఈ విజయంతో ప్రపంచం ఆనందంగా ఉంది. ఆమె అద్భుతమైన మేధో సంపత్తి కలిగిన తెలివైన వ్యక్తి కమలాహారిస్..  అలాంటి వ్యక్తి సాధించిన విజయాన్ని మనం మర్చి పోకూడదు. కుడోస్.. అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.