Twitter: ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సేవల్లో అంతరాయం నెలకొంది. 2022, ఫిబ్రవరి 11వ తేదీ శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత ట్విట్టర్ సేవల్లో సమస్యలు ఎదుర్కొన్నామని యూజర్లు ఫిర్యాదు చేశారు. మొబైల్స్, వెబ్ సైట్ లో కూడా ట్విట్టర్ లో సమస్యలను ఎదుర్కొన్నామని తెలిపారు. సాంకేతిక కార‌ణాల వల్ల ఈ స‌మ‌స్య వ‌చ్చిన‌ట్టు ట్విట్ట‌ర్ పేర్కోంది. 

Twitter: సోషల్‌ మీడియా నేడు మ‌న జీవితంలో భాగమైంది. అదీ.. ఎంతలా అంటే రోజులో క‌నీసం ఓ అర‌గంట సేపైనా.. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండలేకపోతున్నారు చాలామంది. మ‌రీ ముఖ్యంగా టీనేజ్ పిల్లలు వీటికి బానిసలుగా మారుతున్నారు. బోర్‌ కొట్టినప్పుడు, ఒత్తిడిగా అనిపించినప్పుడు తమ స్నేహితులతో మాట్లాడడం కోసం, తమ సమాచారాన్ని పంచుకోవడానికి.. సామాజిక మాధ్యమాలను విపరీతంగా ఉపయోగిస్తున్నారు.

ఏ విషయమైనా.. ఇత‌రుల‌కు వెంటనే తెలియచేయడంలో సోషల్ మీడియా చాలా కీలక స్థానంగా మారింది. ఏక‌కాలంలో ఎంతో మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటారు. అయితే.. సామాజిక మాధ్య‌మ వేదిక‌ల్లో అప్పుడప్పుడు కొన్ని సాంకేతిక సమస్యలు త‌ల్లెత్తుతాయి. దీంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గుర‌వుతారు. సేవ‌లు నిలిచిపోవ‌డంలో యూజర్లు పోస్టులు, ఇతరత్రా చేయలేకపోతుంటారు.

తాజాగా.. సామాజిక మాధ్య‌మ దిగ్గజాల్లో ఒక్క‌టైన‌ ట్విట్టర్ సేవలు ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోయాయి. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు ట్విట్టర్‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌ల్లెత్తాయి. దీంతో దీంతో నెటిజ‌న్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ట్విట్టర్‌లో ట్వీట్లు చేయడానికి వినియోగ‌దారులు నానా ఇబ్బందులు పడ్డారు. మొబైల్ మాత్రమే కాదు.. వెబ్‌సైట్‌లోనూ ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ మొరాయించింది. 
లోడింగ్ సమస్యతో పాటు పోస్టింగ్ లు చేయలేకపోయారు. మ‌రికొంద‌రూ లాగిన్ కూడా కాలేక‌పోయారు. మ‌రికొంద‌రూ లాగిన్ కాగానే..వెంటనే లాగౌట్ అంటూ వచ్చిందని యూజర్లు ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడిందని యూజర్లు ఫిర్యాదు చేయడంతో యాజమాన్యం స్పందించింది. టెక్నికల్ గా సమస్యలు ఏర్పడ్డాయని, వెంటనే దీనిని సరిచేయడం జరిగిందని యూజర్లకు తెలిపింది. జరిగిన అంతరాయనికి క్షమించాలని విజ్ఞప్తి చేసింది.

ట్విట్టర్ సేవలు నిలిచిపోవడంపై డౌన్​డిటెక్టర్​ అనే ట్రాక్​ ప్రకారం.. సుమారు 48 వేలకు పైనే ఫిర్యాదులు అందాయి. టెక్నికల్​బగ్ కారణంగానే తమ సేవలకు ఆటంకం కలిగినట్లు ట్విట్టర్ తెలిపింది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని ట్విట్ట‌ర్ వేడుకుంది. ఈ క్ర‌మంలో ట్విటర్​ తిరిగి సేవలు ప్రారంభించగానే.. ట్విటర్‌నే ట్రోల్​చేస్తూ పలువురు ట్వీట్లు చేశారు.