రష్యా ఫెడరేషన్ బలగాలతో ఉక్రెయిన్‌లోని వేర్పాటువాదులు చేతులు కలిపారని రష్యా రక్షణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. రష్యా బలగాలు 2014లో క్రిమియన్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ప్రాంతాన్ని ఉక్రెయిన్‌పై దాడి చేయడానికీ వినియోగించుకుంది. క్రిమియా నుంచి ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు జరిపింది. ఈ నేపథ్యంలోనే కొందరు తిరుగుబాటుదారులతో తమ బలగాలు చేతులు కలిపారని వివరించింది.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine)పై రష్యా(Russia) బలగాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్, మరో కీలక నగరం ఖార్కివ్‌పై దాడులు చేపట్టింది. తాజాగా, ఈ దాడులపై రష్యా రక్షణ శాఖ మాట్లాడుతూ ఓ కీలక విషయాన్ని వెల్లడించింది. తమ బలగాలు వేర్పాటువాదులతో చేతులు కలపాల్సి వచ్చిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. రష్యన్ ఫెడరేషన్ సాయుధ బలగాలతో రెబెల్స్ చేరిపోవాల్సి వచ్చిందని, అవి సంయుక్తంగా అజోవ్ సముద్ర తీరంలోని ప్రాంతంతోపాటు మరికొన్ని కీలక ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకుందని వివరించారు.
రష్యా బలగాలు 2014లో క్రిమియన్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ప్రాంతాన్ని ఉక్రెయిన్‌పై దాడి చేయడానికీ వినియోగించుకుంది. క్రిమియా నుంచి ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు జరిపింది. ఈ నేపథ్యంలోనే కొందరు తిరుగుబాటుదారుల(Rebels)తో తమ బలగాలు చేతులు కలిపారని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
తూర్పు ఉక్రెయిన్‌లోని తిరుగుబాటుదారులను రష్యా ఎగదోస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వారిని దేశంలోని పశ్చిమం వైపు చొచ్చుకుపోవడానికి ప్రేరేపిస్తున్నట్టు వానదలు వస్తున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లో స్వాతంత్ర్యం ప్రకటించుకున్న డొనెత్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ నేతలు కొందరు ఈ విషయం గురించి మాట్లాడారు. క్రిమియాకు, రెబెల్ ప్రాంతానికి మధ్య నున్న కీలకమైన పోర్టు నగరాన్ని ఆక్రమించుకోవాలని భావించినట్టు ఈ రోజు ఉదయం తెలిపారు.
కాగా, అజోవ్ సముద్రానికి సమీపంలోని కీలక నగరం మరియుపోల్‌లో విద్యుత్‌ను నిలిపేసినట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో రష్యా బలగాలు ముందుకు దూసుకువస్తున్నట్టు తెలియగానే ఎలక్ట్రిసిటీ కట్ చేసినట్టు వివరించారు. కాగా, మంగళవారం కొనషెంకోవ్ మాట్లాడుతూ, ఈ సముద్రం నుంచి రష్యా బలగాలు లాంగ్ రేంజ్ హై ప్రిసిషన్ దాడులు చేపట్టినట్టు వెల్లడించారు. అయితే, వాటి టార్గెట్లను వెల్లడించలేదు. కానీ, ఆ దాడుల్లో రెండు ఎయిర్‌ఫీల్డులను, మూడు ఎయిర్ డిఫెన్స్ రాడార్లను ధ్వంసం చేసినట్టు తెలిపారు. అలాగే, పౌరుల నివాసాలకు ఎలాంటి నష్టం జరగలేదని వివరించారు.
రష్యా సంస్కృతిని ఆచరించే దాని పొరుగునే అంటే తూర్పు ఉక్రెయిన్‌లోని ప్రజలు కొందరు ప్రభుత్వంపై తిరుగుబాట్లు చేశారు. దొంబాస్ రీజియన్‌లోని రెండు ప్రాంతాలు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. దొనెత్స్క్ పీపుల్స్ రిపబ్లిక్(డీపీఆర్), లుహన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్(ఎల్‌పీఆర్)లుగా ప్రకటించుకున్నాయి. కానీ, వాటిని దేశాలు మరే దేశాలూ గుర్తించలేవు. అయితే, ఆ ‘తిరుగుబాట్ల’ను అణచివేయడానికి ఉక్రెయిన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆ రెండు ప్రాంతాల్లో నిర్వహించిన రెఫరెండంలో రష్యాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాని విశ్వసనీయతను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే వాదనలూ ఉన్నాయి. అయితే, ఈ రెండు ప్రాంతాల్లో ఉక్రెయిన్ బలగాలకు, రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదులకు మధ్య భీకర దాడులు జరిగాయి. ఈ దాడుల విరమణకు మిన్స్క్ ఒప్పందాలూ జరిగాయి. కానీ, ఆ ఒప్పందాల ఉల్లంఘనే ఎక్కువ. పశ్చిమ దేశాలూ ఆ ఒప్పందాన్ని లైట్ తీసుకున్నాయి. దీంతో డీపీఆర్, ఎల్‌పీఆర్‌లు తమ భద్రతపై బెంగ పెట్టుకున్నాయి. ఆ రెండు పీపుల్స్ రిపబ్లిక్‌లు తమకు సహాయం చేయాల్సిందిగా రష్యాను కోరాయి.
