Asianet News TeluguAsianet News Telugu

సెలీనా ఇన్ స్టా గ్రామ్ పోస్టు కాస్ట్ ఎన్ని కోట్లో తెలుసా...

సోషల్ మీడియాలో పోస్టులు అంటే లైక్ లు, కామెంట్లు, షేరింగ్ లు వస్తుంటాయి....ఒక్కోసారి తలనొప్పులు తెచ్చిపెడితే మరోసారి అవకాశాలు కల్పిస్తాయి. అయితే ఇదే సోషల్ మీడియా ప్రముఖ అమెరికన్‌ గాయని, నటి సెలీనాకు కోట్లు కోట్లు కుమ్మరిస్తోంది. ఒక్కో పోస్టుకు వేలల్లో కాదు లక్షల్లో కాదు ఏకంగా కోట్లు తెచ్చిపెడుతోంది...ఒకకోటో రెండు కోట్లో కాదు అక్షరాలా 24 కోట్లు. 

selena gomez Instagram post costs Rs 24 crores
Author
Los Angeles, First Published Aug 30, 2018, 1:10 PM IST

లాస్‌ఏంజెల్స్‌: సోషల్ మీడియాలో పోస్టులు అంటే లైక్ లు, కామెంట్లు, షేరింగ్ లు వస్తుంటాయి....ఒక్కోసారి తలనొప్పులు తెచ్చిపెడితే మరోసారి అవకాశాలు కల్పిస్తాయి. అయితే ఇదే సోషల్ మీడియా ప్రముఖ అమెరికన్‌ గాయని, నటి సెలీనాకు కోట్లు కోట్లు కుమ్మరిస్తోంది. ఒక్కో పోస్టుకు వేలల్లో కాదు లక్షల్లో కాదు ఏకంగా కోట్లు తెచ్చిపెడుతోంది...ఒకకోటో రెండు కోట్లో కాదు అక్షరాలా 24 కోట్లు. 

సెలీనాకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్. సింగర్ గా..యాక్టర్ గా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్. అదే సెలీనా ఇన్ స్టాగ్రామ్ లో అయితే ఇక చెప్పనవసరం లేదు. 141.5 మిలియన్ ఫాలోవర్స్‌ ను సంపాదించుకుంది సెలీనా. ఈ  ఫాలోవర్స్ అంతా సెలీనా పోస్ట్‌ చేసే ఫొటోలు, వీడియోల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఆమె ఒక్క పోస్ట్‌ చేస్తే చాలు లక్షల్లో లైక్‌లు, కామెంట్లు వచ్చి పడుతుంటాయి. 

సెలీనా పెట్టే పోస్టులు..ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరుగుతుండటాన్ని బడా కంపెనీలు దృష్టిసారించాయి. సెలీనా ఏదైనా పోస్టు పెడితే విపరీతంగా ప్రచారం జరగడంతో దాన్నిక్యాష్ చేసుకునేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇన్ స్టాగ్రామ్ లో సెలీనా తమ కంపెనీకి సంబంధించి పోస్ట్ చేస్తే అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు క్యూ కడుతున్నాయి. 

తాజాగా సెలీనా ప్రముఖ జర్మన్‌ కంపెనీ అయిన ప్యూమాకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఈ బ్రాండ్‌కు సంబంధించి సెలీనా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ఒక్కో పోస్ట్‌కు ఆమె ఎంత సంపాదిస్తోందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. సెలీనా పెట్టే ఒక్కో పోస్ట్‌కు 3.5 మిలియన్‌ డాలర్లు పారితోషికంగా తీసుకుంటుంది. అంటే మన కరెన్సీలో 24 కోట్ల 75 లక్షల రూపాయలు. ప్యూమా బ్రాండ్‌కు చెందిన దుస్తులు, షూస్‌ వేసుకుని సెలీనా దిగిన ఫొటోలకు లక్షల్లో లైక్‌లు వస్తున్నాయి. 

అయితే ప్యూమా నుంచి సెలీనా తీసుకునే పారితోషికంలో కొంతభాగం ఓ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌కు విరాళంగా ఇస్తోంది. రెండేళ్ల క్రితం సెలీనాకు ల్యూపస్‌ వ్యాధి సోకింది. దాంతో ఆమెకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. మృత్యువుతో పోరాడిన సెలీనాను ఆమె స్నేహితురాలు హాలీవుడ్ నటి ఫ్రాన్సియా రైజా కాపాడారు. ఒక కిడ్నీ దానం చేసి ప్రాణం పోశారు. తనలా ఈ వ్యాధితో ఇంకెవరూ బాధపడకూడదని, మెరగైన ఔషధాలు తయారుచేసేందుకు పరిశోధనలు చేస్తున్న సంస్థలకు సెలీనా విరాళాలు ఇస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios