Worlds biggest plant: 4500 ఏండ్ల 180 కి.మీ. పొడవు మొక్క.. ఆశ్చర్యపర్చే ఇది మాన్‌హాటన్ దీవికి రెట్టింపు పెద్దది

World Largest Plant Ocean: ఈ భూమిపై ఎక్కడైనా అతిపెద్ద మొక్క ఏదైనా ఉందా అంటే అది  'పోసిడోనియా ఆస్ట్రాలిస్' అనే జాతికి చెందినది. దీనిని సాధారణంగా ఫైబర్-బాల్ కలుపు లేదా రిబ్బన్ కలుపు అని పిలుస్తారు. ఇది ఆస్ట్రేలియా దక్షిణ తీరప్రాంతంలో గుర్తించారు. 

Scientists spot the worlds biggest plant which is more than thrice the size of Manhattan Island

Posidonia australis: మీరు ఇప్పుడు తెలుసుకోబోయే ఈ మొక్క మిమ్మ‌ల్ని ఎంతో ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది.  ఎందుకంటే దీని జీవిత కాలం 4500 సంవ‌త్స‌రాల‌కు పైనే.. అలాగే, 180 కిలో మీట‌ర్ల పొడ‌వులో ఉంది. అంటే 20 వేల‌కు పైగా ర‌గ్బీ మైదానాల‌కు స‌మానంగా ఈ మొక్క విస్త‌రించింది. ఈ భూమిపై ఎక్కడైనా అతిపెద్ద మొక్క ఏదైనా ఉందా అంటే అది  'పోసిడోనియా ఆస్ట్రాలిస్' అనే జాతికి చెందినది. దీనిని సాధారణంగా ఫైబర్-బాల్ కలుపు లేదా రిబ్బన్ కలుపు అని పిలుస్తారు. ఇది ఆస్ట్రేలియా దక్షిణ తీరప్రాంతాలలో పెరుగుతుంది.  దీనిని తాజాగా శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. 'పోసిడోనియా ఆస్ట్రాలిస్' అనే జాతికి చెందిన ఈ మొక్క గురించి ప‌రిశోధ‌కులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

భూమిపై ఎక్కడైనా అతిపెద్ద మొక్క 'పోసిడోనియా ఆస్ట్రాలిస్' అనే జాతికి చెందినది. దీనిని సాధారణంగా ఫైబర్-బాల్ కలుపు లేదా రిబ్బన్ కలుపు అని పిలుస్తారు. ఇది ఆస్ట్రేలియా దక్షిణ తీరప్రాంతాలలో  అధికంగా పెరుగుతాయి. ఈ జాతికి చెందిన అతిపూరాత‌న, అతివెడ‌ల్సు, పొడ‌వైన మొక్క‌ను ప‌రిశోధ‌కులు గుర్తించారు. శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ మొక్క ఒకే విత్తనం నుండి ఉద్భవించింది. ఇది సుమారు 4,500 సంవత్సరాల క్రితం రెండు వేర్వేరు సీగ్రాస్ జాతుల విలీనంతో ఏర్ప‌డింది. భూమి  అతిపెద్ద మొక్కగా గుర్తింపు పొందిన ఇది దాదాపు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్త‌రించి ఉంది. ఇది మాన్‌హట్టన్ ద్వీపం కంటే మూడు రెట్లు ఎక్కువ పెద్ద‌దిగా ఉంది. 

ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలోని రిబ్బన్ కలుపులో జన్యుపరమైన తేడాలను అధ్యయనం చేయడానికి నిర్వహించిన లోతైన పరిశోధనలో - షార్క్ బే ఆశ్చర్యకరమైన ఫలితాలను వెల్లడించింది. ఈ అధ్యయనం కోసం నమూనాలను 180 కిలోమీటర్ల దూరంలో పెరుగుతున్న మొక్కల నుండి తీసుకోగా, మొక్క  బహుళ నమూనాలు లేవని పరిశోధ‌కులు పేర్కొన్నారు. సముద్ర గర్భంలో పరిశోధనలు చేస్తుండగా.. అనుకోకుండానే ఈ మొక్క గురించి వెలుగులోకి వచ్చింది. ఒకటికి పదిసార్లు పరీక్షించాకే.. ఇదంతా ఒకే మొక్కగా నిర్ధారించారు పరిశోధకులు. శాస్త్రవేత్తలు ఒకదానికొకటి చాలా దూరంలో ఉన్న పోసిడోనియా ఆస్ట్రేలిస్ నమూనాలను గుర్తించి ఆశ్చర్యపోయారు. జ‌న్యుప‌రిశోధ‌న‌ల ద్వారా అది ఒకే మొక్క అని గుర్తించారు.  ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయంలోని పర్యావరణ శాస్త్రవేత్త  డాక్టర్ మార్టిన్ బ్రీడ్ ఈ మొక్క గురించి మాట్లాడుతూ.. మేము పూర్తిగా షాక్ తో పాటు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాము అని తెలిపారు.

యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా - జెన్ ఎడ్జెలో విద్యార్థి పరిశోధకుడు ప్రకారం.. "ప్రస్తుతం ఉన్న 200 చదరపు కిలోమీటర్ల రిబ్బన్ కలుపు పచ్చికలు ఒకే వలసరాజ్య మొలక నుండి విస్తరించినట్లు కనిపిస్తున్నాయి. ఇది పచ్చిక విస్తరించినట్లే రైజోమ్‌లను ఉపయోగించి అదే మొక్క పెద్దగా విస్తరించినట్లు తెలిసింది" అని అన్నారు. ఈ మొక్క ఇప్పుడు డాల్ఫిన్లు, తాబేళ్లు, పీతలు మరియు చేపలతో సహా అనేక సముద్ర జాతులకు ఆవాసంగా మారిందని తెలిపారు. పరిశోధకుల ప్ర‌కారం.. మొక్క ఇంత దూరం విస్తరించడానికి 4,500 సంవత్సరాలు పట్టి ఉండాలి. సంవత్సరానికి 35cm పెరిగే రిబ్బన్ కలుపు రైజోమ్‌ల పెరుగుదల వేగాన్ని విశ్లేషించడం ద్వారా ఇది తెలుసుకోబ‌డింద‌న్నారు. అయితే, సార్క్ బే లో మొక్క‌లు పెర‌గ‌డానికి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ.. ఇది ఇంతలా పెర‌గ‌డం ఆశ్చ‌ర్యానికి గురిచేసింద‌న్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios