Asianet News TeluguAsianet News Telugu

సల్మాన్ రష్దీపై దాడి చేసిందెవరు? అమెరికాలో ఉంటున్న హాదీ గురించి టాప్ పాయింట్స్

సల్మాన్ రష్దీపై దాడికి పాల్పడింది హాదీ మటర్ అని పోలీసులు గుర్తించారు. అరెస్టు చేశారు. హాదీ మటర్ న్యూజెర్సీలో నివసిస్తున్నట్టు తెలిసింది. ఆయనకు ఇరాన్ ప్రభుత్వం పట్ల సానుకూల భావాలు ఉన్నట్టు అర్థం అవుతున్నది. సల్మాన్ రష్దీని చంపేయాలని గతంలో ఇరాన్ ప్రభుత్వం ఫత్వా జారీ చేసిన సంగతి తెలిసిందే.
 

salman rushdie attacked by hadi matar.. who is he?
Author
New Delhi, First Published Aug 13, 2022, 1:22 PM IST

న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి ప్రపంచాన్ని కదిలించింది. అమెరికాలో ఓ వేదికపై ప్రసంగం ఇవ్వడానికి వెళ్లిన ఆయనపై కత్తితో దాడి జరిగింది. మెడపై, కడుపులో కత్తి పోట్లు ఉన్నాయి. సల్మాన్ రష్దీపై 20 సెకండ్లలో 15 సార్లు కత్తితో పొడిచారని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. వెంటనే ఆయనను చాపర్‌లో హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందుతున్నది. ఈ దాడి కారణంగా ఆయన కన్ను కోల్పోయే ముప్పు ఉందని తెలిసింది. ఈ దాడికి పాల్పడింది హాదీ మటర్ అని పోలీసులు గుర్తించారు. అరెస్టు చేశారు. సల్మాన్ రష్దీని హతమార్చే ప్రయత్నం చేసిన హాదీ మటర్ గురించి కీలక విషయాలు చూద్దాం.

హాదీ మటర్ అమెరికాలో ఉంటున్నాడు. ఆయన నివసిస్తున్న చివరి అడ్రెస్ న్యూజెర్సీలోని ఫెయిర్ వ్యూ అని గుర్తించారు. మాన్‌హటన్‌లోని హుడ్సన్ రివర్ సమీపంలో నివసిస్తున్నట్టు తెలిసింది. హాదీ ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. ఇతరుల ప్రమేయాన్ని (ఉన్నదా? అని) కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతర ప్యాట్రన్‌ల వలెనే హాదీ మటర్ కూడా పాస్‌లు కొనుక్కొని వెళ్లారు. సల్మాన్ రష్దీ ఈవెంట్‌కు హాజరయ్యారు.

సాతానిక్ వర్సెస్ అనే పుస్తకం రాసిన సల్మాన్ రష్దీకి ప్రాణ హాని ఎప్పటి నుంచో ఉన్నది. ఆయనను చంపేయాలని ఏకంగా ఇరాన్ ప్రభుత్వం 1989లో ఒక ఫత్వానే జారీ చేసింది. ఈ ఇరాన్ ప్రభుత్వం పట్ల హాదీ పక్షపాతంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఇరాన్ లీడర్ అయతొల్లా ఖొమెనీ ఫొటో కనిపించింది. సల్మాన్ రష్దీపై ఫత్వా జారీ చేసిన నేత ఈయనే కావడం గమనార్హం. ఈయన తర్వాత బాధ్యతలు తీసుకున్న అయతొల్లా ఖమెనెయి ఫొటోలు కూడా ఉన్నాయి.

అంతేకాదు, ఇరాన్‌కు మద్దతు, దాని రివల్యూషనరీ గార్డ్‌కు మద్దతుగా ఆయన కొన్ని పోస్టులు చేసినట్టు ఎన్‌బీసీ న్యూస్ పేర్కొంది. అలాగే, షియా తీవ్రవాదానికి కూడా సపోర్ట్ చేస్తున్నట్టు గుర్తించింది. ఆయనకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు సమాచారం కనిపించలేదు. కానీ, ఇరాన్ మిలిటరీ నేత.. హత్యకు గురైన ఇరానియన్ కమాండర్ ఖాసీం సొలేమని ఫొటోలు హాదీ మటర్ మెస్సేజింగ్ యాప్‌లో కనిపించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios