ఓ పైలట్ కక్కుర్తి చూపించాడు. తను ట్రైనింగ్ ఇచ్చే మహిళతో ఆకాశంలో శృంగారం చేశాడు. అంతేకాదు అదంతా రికార్డు చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో చిక్కుల్లో పడ్డాడు.
రష్యా : విమానం ఎగురుతుండగా Trainee Pilotతో పైలెట్ sex జరిపాడు. అంతటితో ఆగకుండా దాన్నంతా video తీశాడు. ఈ వీడియో viral కావడంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. రష్యాలోని సాసోవో ఫ్లైట్ స్కూల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లో ఈ సంఘటన వెలుగుచూసింది. 28 యేండ్ల పైలట్ కొందరు ట్రైనీలకు training ఇస్తున్నాడు. రియాజాన్ ప్రాంతంలో సెస్నా 172 విమానంలో ఒక మహిళ ట్రైనీకి శిక్షణ ఇస్తూ ఎక్స్ట్రా క్లాస్ ల పేరుతో ఆమెను లోబరుచుకున్నాడు.
విమానాన్ని ఆటో పైలట్ మోడ్ లో ఉంచి ఆ మహిళతో శృంగారం జరిపాడు. దీన్ని మొబైల్ ఫోన్ లో రికార్డు చేశాడు. కాగా, అక్కడ శిక్షణ పొందుతున్న ఒక విద్యార్థి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అయింది. దీంతో శిక్షణ ఇచ్చే పైలెట్ తో పాటు మహిళా ట్రైనీని ఆ ఫ్లైట్ స్కూల్ తొలగించింది. అయితే ఈ వీడియో వైరల్ కాకముందే ఆమె కాకముందే ఆ మహిళ రిజైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
అలాగే ఆ పైలట్ వివాహితుడు కావడంతో శృంగారాన్ని రికార్డ్ చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఎక్స్ట్రా క్లాసులు చెబుతానని ఆ పైలెట్ హామీ ఇవ్వడంతో దానికి ఆమె ఒప్పుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏదేమైతేనేం చివరికి క్షణిక మైన కోరికతో ఇద్దరి జీవితాలూ ఇబ్బందుల్లో పడ్డాయి.
ఇదిలా ఉండగా, ఇలాంటి వింత ఘటనే గురువారం జపాన్ లో జరిగింది. పూర్తిగా జంతువుల కనిపించాలన్న తన జీవిత కలను సాకారం చేసుకున్నాడు ఓ జపాన్ వాసి. అచ్చు ‘కోలీ’ జాతి శునకంలా మారిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పంచుకోగా వాటిని చూసిన నెటిజన్లు సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతున్నారు. పూర్తి శునకంలా కనిపించేందుకు ఓ వ్యక్తి భారీగా ఖర్చు చేయగా, నిపుణులు నలభై రోజులపాటు కష్టపడ్డారు.
జపాన్ కు చెందిన న్యూస్.మైనవి వార్తా ఏజెన్సీ ప్రకారం.. జెప్పెట్ అనే ఓ సంస్థ సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, వినోద సౌకర్యాల కోసం పెద్దఎత్తున శిల్పాలను తయారు చేస్తోంది. అద్భుత కళాఖండాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రసిద్ధ మస్కట్ పాత్రల దుస్తులను కూడా రూపొందిస్తోంది. కాగా టోకో ఇవీ అనే వ్యక్తి.. పూర్తిగా శునకంలా కనిపించాలనే కోరికను జెప్పెన్ ముందుంచాడు. ఎంత ఖర్చు అయినా భరిస్తాను అని చెప్పడంతో ఇందుకు ఆ సంస్థ అంగీకరించింది.
సంస్థ కళాకారులు 40 రోజుల పాటు కష్టపడి టోకో ఇవీని కోలీ జాతి శునకంలా మార్చారు. మేకప్, ఇతరత్రా ఖర్చులకోసం ఇవీకి 2 మిలియన్ యెన్ లు (దాదాపు రూ. 12 లక్షలు) ఖర్చయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో, వీడియో యూట్యూబ్ ఛానల్ లో పంచుకున్నాడు టోకో ఇవీ. అయితే ఎన్ని రోజుల పాటు ఇలా ఉంటాను అనే విషయం మాత్రం అతను చెప్పలేదు.
