Russia Ukraine War: రష్యాకు మరో ఎదురు దెబ్బ తగలింది. రష్యా మేజర్ జనరల్ ఒలేగ్ మిత్యేవ్ ఉక్రెయిన్ సైన్యం చేతిలో హతమైనట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మెయిన్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌ను ఉటంకిస్తూ కైవ్ ఇండిపెండెంట్ ఈ విషయాన్ని పేర్కొంది. గత 20 రోజుల్లో నలుగురు మేజర్ జనరల్ చనిపోయినట్టు ఉక్రెయిన్ మీడియా పేర్కొంది.
Russia Ukraine War: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం 20వ రోజుకు చేరింది. ఇప్పటికే మూడు సార్లు శాంతి చర్చలు జరిపిన ఎలాంటి ఫలితం లేకుండానే విఫలమయ్యాయి. ఓ వైపు రెండు దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ ఖార్కివ్‌లో రష్యన్ మేజర్ జనరల్ ఒలేగ్ మిత్యేవ్.. ఉక్రెయిన్ సైనికుల చేతులో ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మెయిన్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌ను ఉటంకిస్తూ కైవ్ ఇండిపెండెంట్ ఈ విషయాన్ని పేర్కొంది. రష్యన్ మేజర్ జనరల్ ఒలేగ్ మిత్యేవ్ 150వ మోటరైజ్డ్ రైఫిల్ డివిజన్ లో సేవలందిస్తున్నారు. కైవ్ ఇండిపెండెంట్ ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 24 నాటి నుంచి నేటీ వరకు దాదాపు 13,500 రష్యా సైనికులను హతమర్చామని, 81 యుద్దవిమనాలను, 95 హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. అలాగే.. 404 యుద్ధ ట్యాంకులను, 1279 సాయుధ వాహనాలను, 3 నౌకలు, 36 యాం ఏయిర్ క్రాప్ట్ వార్ ఫేర్ సిస్టమ్స్ ను కూడా ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ తాజా నివేదికల్లో వెల్లడించింది. ఈ తరుణంలో మరో రష్యాన్ మేజర్ జనరల్ ఒలేగ్ మిత్యేవ్ ప్రాణాలు కోల్పోవడం రష్యాకు మరో ఎదురుదెబ్బ.
గత 20 రోజుల్లో నలుగురు మేజర్ జనరల్ లు ప్రాణాలు కోల్పోయినట్టు ఉక్రెయిన్ మీడియా ప్రకటించింది. ఉక్రెయిన్‌పై దాడి చేసిన మొదటి 15 రోజులలో రష్యా సైనిక విపత్తు ఏర్పడిందని తెలిపింది. రష్యా ఉక్రెయిన్ యుద్దంలో ఒక్క వారంలో మరణించిన వారి సంఖ్య.. ఆఫ్ఘనిస్తాన్‌లో నాలుగు నెలల్లో జరిగిందని తెలిపింది. ఉక్రేనియన్ వార్తాపత్రిక టెలిగ్రాఫ్ ప్రకారం.. రష్యాన్ మేజర్ జనరల్ ఒలేగ్ మిత్యేవ్ మంగళవారం 11:34 గంటలకు మరణించినట్టు పేర్కొంది. మిత్యేవ్ రష్యన్ సైన్యం యొక్క 150వ మోటరైజ్డ్ రైఫిల్ విభాగానికి కమాండర్. ఈ విభాగం యాంత్రిక పదాతి దళం. ఉక్రేనియన్ అజోవ్ రెజిమెంట్.. మిత్యేవ్ మృతదేహం ఫోటోను, అతని ఛాతీపై ఉన్న ర్యాంక్ చిహ్నంతో ప్రచురించింది. 2015లో డాన్‌బాస్‌లో జనరల్ మిత్యేవ్ రష్యన్ దళాలకు నాయకత్వం వహించాడని టెలిగ్రాఫ్ పేర్కొంది.
మార్చి 3 న రష్యన్ ఆర్మీ జనరల్ మొదటి సభ్యుడు మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్స్కీ మరణించారు. ఆయన రష్యన్ గ్రౌండ్ ఫోర్సెస్.. 41వ కంబైన్డ్ ఆర్మ్స్ ఆర్మీకి డిప్యూటీ కమాండర్, అతని మరణాన్ని రష్యన్ మీడియా కూడా ధృవీకరించింది.
సోమవారం, మార్చి 7 న మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్ కూడా మరణించారు. ఆయన రష్యన్ గ్రౌండ్ ఫోర్సెస్ యొక్క 41వ కంబైన్డ్ ఆర్మ్స్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్. ఆయన గెరాసిమోవ్ రెండవ చెచెన్ యుద్ధం, సిరియన్ యుద్ధం, 2014లో క్రిమియాపై రష్యా దాడిలో పాల్గొన్నాడు. అతను ఖార్కోవ్ సమీపంలో మరణించాడని ఉక్రెయిన్ మీడియా ప్రకటించింది. అతని మరణం రష్యన్ మీడియా ధృవీకరించలేదు. కానీ తిరస్కరించలేదు కూడా. మార్చి 11, శుక్రవారం రోజున తూర్పు మిలిటరీ డిస్ట్రిక్ట్ యొక్క 29వ కంబైన్డ్ ఆర్మీ కమాండర్ మేజర్ జనరల్ ఆండ్రీ కొలెస్నికోవ్( 45) మరణించారు.
రష్యన్ సైట్ Valenteshop.ru ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కొనసాగిన పదేళ్లలో (1979-1989) 4 సోవియట్ జనరల్స్ మరణించారు. ఉక్రెయిన్‌పై దాడి చేసిన కేవలం 20 రోజులలో రష్యా ఇప్పటికే 4 మేజర్ జనరల్ లను కోల్పోయింది. అలాగే.. దాదాపు 13 వేల మంది సోల్జర్లను కోల్పోయింది. గత వారం, ఉక్రెయిన్ దాడిలో భాగమైన రష్యన్ దళాలలో సుమారు 20 మంది జనరల్స్ ఉన్నారని అధికారిక ఉక్రేనియన్ వర్గాలు పేర్కొన్నాయి.
