Asianet News TeluguAsianet News Telugu

విడాకుల భరణంగా రూ.52వేల కోట్లు కావాలి.. ఓ భార్య ట్విస్ట్.. ఎక్కడంటే...

విడాకుల సమయంలోనే ఆమెకు కొంత భరణం అందించారు. అయితే తనకు భరణం విషయంలో అన్యాయం జరిగిందని.. మరింత సొమ్ము ఇప్పించాలని తాజాగా లండన్లోని కోర్టును ఆశ్రయించారు. ప్రముఖ తయారీ కంపెనీ MMC Norilsk PJSCలో వ్లాదిమిర్ కు ఉన్న వాటాలో 50% తనకు ఇప్పించాలని విన్నవించారు.  ప్రస్తుత లెక్కల ప్రకారం 52.8 వేల కోట్ల పై మాటే అని సమాచారం.

russian billionaire and wife divorce case, she wants rs,52,000 crores as alimony
Author
Hyderabad, First Published Dec 9, 2021, 3:10 PM IST

లండన్ : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 52 వేల కోట్లు Maintenance ఇప్పించాలంటూ Britain లో కోర్టును ఆశ్రయించారు ఒక బిలియనీర్ మాజీ భార్య.  Russiaలో అత్యంత సంపన్నుల జాబితాలో Vladimir Potanin ది రెండోస్థానం. ఆయన ఆస్తి విలువ సుమారు రూ.2.25 లక్షల కోట్లు. 31 ఏళ్ల కాపురం తర్వాత భార్య నటాలియా పొటానినా నుంచి ఆయన విడాకులు తీసుకున్నారు.

విడాకుల సమయంలోనే ఆమెకు కొంత భరణం అందించారు. అయితే తనకు భరణం విషయంలో అన్యాయం జరిగిందని.. మరింత సొమ్ము ఇప్పించాలని తాజాగా లండన్లోని కోర్టును ఆశ్రయించారు. ప్రముఖ తయారీ కంపెనీ MMC Norilsk PJSCలో వ్లాదిమిర్ కు ఉన్న వాటాలో 50% తనకు ఇప్పించాలని విన్నవించారు.  
ప్రస్తుత లెక్కల ప్రకారం 52.8 వేల కోట్ల పై మాటే అని సమాచారం. దాంతోపాటు రష్యాలో వ్లాదిమిర్ కు ఉన్న మరికొన్ని ఆస్తులనూ ఆమె కోరుతున్నట్లు తెలుస్తోంది. గతంలో లండన్లోని విడాకుల కోర్టులు గతంలో పలు కేసుల్లో భారీ మొత్తాల్లో భరణాలను ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాయి. 

ఆస్తుల్లో భార్య-భర్తలకు దాదాపు సమాన వాటా ఉండేలా కూడా తీర్పులిచ్చాయి. ఈ నేపథ్యంలో పొటానినాకు అనుకూలంగా తీర్పు రావడం ఖాయమని తెలుస్తోంది. అదే జరిగితే... అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రూ. 2.7 లక్షల కోట్లు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 1.96 లక్షల కోట్ల తర్వాత అత్యధిక భరణం ఇవ్వనున్న వ్యక్తిగా వ్లాదిమిర్ రికార్డు ఎక్కుతారు. 

ఇవి కాస్ట్లీ విడాకులు..ఈ సెలబ్రెటీలు భార్యలకు ఎంత భరణం ఇచ్చారంటే..!

ఇదిలా ఉండగా..జెఫ్ బెజోస్ తన భార్యకు 2019లో విడాకులు ఇచ్చారు. బెజోస్‌తో విడాలకు కారణంగా మెకెంజీకి ఏకంగా దాదాపు రూ.2.62 లక్షల కోట్ల (38 బిలియన్‌ డాలర్లు) డబ్బు ఇవ్వడం గమనార్హం. విడాకుల తర్వాత స్వతహాగా రచయిత అయిన మెకెంజీ ప్రపంచంలోనే నాలుగో అత్యంత ధనిక మహిళగా మారతారు. అయితే ఈ సంపదలో సగం వారెన్‌ బఫెట్, బిల్‌గేట్స్‌ స్థాపించిన ది గివింగ్‌ ప్లెడ్జ్‌ అనే ధార్మిక సంస్థకే అందిస్తానని గతంలోనే ఆమె చెప్పారు.

తమ 27ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్​గేట్స్, మెలిందా ప్రకటించారు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడిగానే కాకుండా పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవటం ఒక్కసారిగా అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే వీరి విడాకులు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా మారనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెలిందాకు బిల్​ ఇచ్చే భరణం విలువ విలువ దాదాపు 127 బిలియన్​ డాలర్లుగా ఉండొచ్చని తెలుస్తోంది.
 
ఆస్ట్రేలియాకు చెందిన మీడియా దిగ్గజం రూపర్ట్​ మర్డాక్​.. స్కాటిష్ జర్నలిస్ట్, రచయిత్రి అన్నా మరియా మన్​ల విడాకులు కూడా చరిత్రలో అత్యంత ఖరీదైనవిగా నిలిచిపోయాయి. 1999లో వీరు విడిపోయారు. ఆ సమయంలో అన్నా మరియా మన్​ 1.7 బిలియన్ డాలర్లు ఆస్తితో పాటు 110 మిలియన్ డాలర్లను నగదు రూపంలో పొందారు.

Follow Us:
Download App:
  • android
  • ios