Asianet News TeluguAsianet News Telugu

ర‌ష్యా-ఉక్రెయిన్ వార్: కూలిన కఖోవ్కా ఆనకట్ట.. పొటెత్తిన వ‌ర‌ద‌లు.. నీట‌మునిగిన ర‌ష్యా ఆధీన న‌గ‌రం

Moscow: దక్షిణ ఉక్రెయిన్ లోని రష్యా ఆక్రమిత నగరం నోవా కఖోవ్కా.. ఇరు దేశాల పరస్పరం దాడుల‌కు కేంద్రంగా మారింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డి ఆన‌క‌ట్ట కూలిపోవ‌డంతో వ‌ర‌ద‌లు సంభ‌వించిన‌ట్టు అధికారులు మంగళవారం రష్యన్ మీడియాకు తెలిపారు. ఈ నగరం వరదలో ఉందని రష్యా నియమించిన నగర పరిపాలన అధిపతి వ్లాదిమిర్ లియోంట్యేవ్ రష్యన్ మీడియాకు చెప్పారు. దాదాపు 300 ఇళ్ల ప్రజలను ఖాళీ చేయించినట్లు లియోంట్యేవ్ తెలిపారు. 
 

Russia Ukraine War: Russian forces destroy Kakhovka dam, triggering humanitarian disaster RMA
Author
First Published Jun 6, 2023, 5:43 PM IST

Russia-Ukraine War: దక్షిణ ఉక్రెయిన్ లోని రష్యా ఆక్రమిత నగరం నోవా కఖోవ్కా.. ఇరు దేశాల పరస్పరం దాడుల‌కు కేంద్రంగా మారింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డి ఆన‌క‌ట్ట కూలిపోవ‌డంతో వ‌ర‌ద‌లు సంభ‌వించిన‌ట్టు అధికారులు మంగళవారం రష్యన్ మీడియాకు తెలిపారు. ఈ నగరం వరదలో ఉందని రష్యా నియమించిన నగర పరిపాలన అధిపతి వ్లాదిమిర్ లియోంట్యేవ్ రష్యన్ మీడియాకు చెప్పారు. దాదాపు 300 ఇళ్ల ప్రజలను ఖాళీ చేయించినట్లు లియోంట్యేవ్ తెలిపారు. 

రష్యన్ మీడియా డ్నిప్రో నదిపై ఉన్న నగరం వ‌ర‌ద దృశ్యాల‌ను పంచుకుంది. దాని సెంట్రల్ స్క్వేర్ పూర్తిగా నిండిపోయింది. ప్రధాన సోవియట్-కాలం నాటి సంస్కృతి గృహం సమీపంలో పూర్తిగా నీరు క‌నిపించింది. క్ర‌మంగా నీటి ప్ర‌వాహం పెరుగుతోంద‌ని నగర పరిపాలన అధిపతి వ్లాదిమిర్ లియోంట్యేవ్ పేర్కొన్నారు. నొవాయా కఖోవ్కా, సమీపంలోని రెండు జనావాసాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు 53 బస్సులను పంపుతున్నారు. అలాగే, వారికి ఆహారం, తాగునీరు అందించే చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు. ఎమర్జెన్సీ రెస్క్యూ సిబ్బంది, నగర పాలక సంస్థ సిబ్బంది, సైనికులు స‌హాయ‌క చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని పేర్కొన్నారు. అవసరమైన వారందరికీ సాయం అందిస్తామని చెప్పారు.

 

 

మరో ఐదు గంటల్లో నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఐదు గంటల్లో నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ ప్రోకుడిన్ తన టెలిగ్రామ్ ఛానెల్లో వీడియోలో పేర్కొన్నారు. రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియన్ ద్వీపకల్పానికి నీటి సరఫరాను నిలిపివేసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన విధ్వంసంగా ఈ ఆనకట్టను ధ్వంసం చేసిన‌ట్టు ర‌ష్య‌న్ అధికారులు ఆరోపించారు. అయితే, ఈ వాద‌న‌ల‌ను ఉక్రెయిన్ ఖండించింది. ర‌ష్యా సైన్యాలే కావాల‌నే ఆన‌క‌ట్ట‌ను కూల్చివేశాయ‌ని మండిప‌డింది. 

ర‌ష్యా ఉగ్ర‌వాదుల ప‌నే ఇది.. : జెల‌న్స్కీ

"రష్యా ఉగ్రవాదులు.. కఖోవ్కా జలవిద్యుత్ కేంద్రం ఆనకట్ట విధ్వంసం ఉక్రెయిన్ భూమి ప్రతి మూల నుండి వారిని బహిష్కరించాలని యావత్ ప్రపంచానికి పిలుపునిస్తుంది. వారికి ఒక్క అవ‌కాశాన్ని కూడా వదిలిపెట్టకూడదు, ఎందుకంటే వారు ప్రతి మీటరును ఉగ్రవాదానికి ఉపయోగిస్తారు. ఉక్రెయిన్ విజయం మాత్రమే భద్రతను పునరుద్ధరిస్తుంది. ఈ విజయం వస్తుంది. నీరు, క్షిపణులు లేదా మరేదైనా దాడితో ఉక్రెయిన్ ను టెర్రరిస్టులు ఆపలేరని" ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెల‌న్స్కీ పేర్కొన్నారు. అలాగే, అన్ని సర్వీసులు పనిచేస్తున్నాయ‌నీ, నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ ను సమావేశపరిచామ‌ని తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios