ఉక్రెయిన్‌పై యుద్దానికి దిగిన రష్యా బాంబుల వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతుంది. ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా బలగాలు వేగంగా దూసుకెళ్తున్నాయి.
ఉక్రెయిన్‌పై యుద్దానికి దిగిన రష్యా బాంబుల వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతుంది. ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా బలగాలు వేగంగా దూసుకెళ్తున్నాయి. తాము కేవలం సైనిక స్థావరాలపైనే దాడులు చేపడుతున్నామని రష్యా చెబుతున్నప్పటికీ.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. వివిధ నగరాలపై రష్యా బాంబులతో దాడులకు పాల్పడుతున్నట్టుగా అక్కడి వార్త సంస్థలు పేర్కొంటున్నాయి. క్షిపణులను ప్రయోగిస్తూ ఉక్రెయిన్ ప్రజలను రష్యా భయబ్రాంతులకు గురిచేస్తుంది.
తాజాగా కైవ్ నగరంలోని రెండు క్షిపణులు రష్యా ప్రయోగించింది. రెండు క్షిపణులు కైవ్ సిటీ సెంటర్‌కు నైరుతి ప్రాంతాలను తాకినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రతినిధి రిపోర్ట్ చేశారు. అందులో ఒకటి Zhulyany airport సమీపంలోని ప్రాంతాన్ని తాకినట్టుగా తెలిపారు. క్షిపణులు సెవాస్టోపోల్ స్క్వేర్ సమీపంలోని ప్రాంతాన్ని తాకినట్లు మరొక సాక్షి చెప్పారు.
అయితే కైవ్ నగరంలోని ఓ ఎత్తైన నివాస భవనాన్ని క్షిపణి ఢీకొట్టినట్టుగా ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి Dmytro Kuleba.. ‘మన అద్భుతమైన కైవ్ నగరంపై రష్యా బలగాలు క్షిపణులతో దాడులకు పాల్పడుతున్నారు. కైవ్‌లోని నివాస అపార్ట్‌మెంట్‌ను ఒక మిస్సైల్ తాకింది. రష్యాను పూర్తిగా వేరు చేయాలని నేను ప్రపంచాన్ని కోరుతున్నారు. చమురు ఆంక్షలు, దాని ఆర్థిక వ్యవస్థను నాశనం చేయండి’ అని పేర్కొన్నారు.
శనివారం నాడు ఉక్రెయిన్ దాడులపై స్పందించిన రష్యా.. ఇప్పటివరకు ఉక్రెయిన్ లోని 118 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. వాటిలో పదకొండు మిలిటరీ ఎయిర్‌ఫీల్డ్‌లు, 13 కమాండ్ పోస్ట్‌లు, ఉక్రేనియన్ సాయుధ దళాల కమ్యూనికేషన్ సెంటర్లు, 14 S-300, ఓసా యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థలు, 36 రాడార్ స్టేషన్లు ఉన్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, ఉక్రెయిన్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలు, ఒక హెలికాప్టర్, ఐదు డ్రోన్‌లు కూల్చివేయబడ్డాయనీ, ఇప్పటివరకు డజన్ల కొద్దీ వాహనాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది.
