Russia Ukraine War: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆంక్షలు విధించారు. బైడెన్‌తో పాటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఆంక్షలను మంగళవారం ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ ఆంక్ష‌లు US సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్,  డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్‌లకు కూడా వర్తిస్తాయ‌ని ర‌ష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది 

Russia Ukraine War: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆంక్షలు విధించారు. బైడెన్‌తో పాటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఆంక్షలను మంగళవారం ప్రకటించారు. అలాగే.. అమెరికా మంత్రులు ఆంటొనీ బ్లింకెన్, లయాడ్ ఆస్టిన్, సీఐఏ డైరెక్టర్ విలియమ్ బర్న్స్‌పై కూడా రష్యా ఆంక్షలు విధించింది. మరో పది మంది అమెరికా ప్రజాప్రతినిధులు, అధికారులపై కూడా రష్యా ఆంక్షలు విధించిందని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలియజేసింది. 

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపధ్యంలో అమెరికా ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై మార్చ్ 3న ఆంక్షలు విధించింది. ప్రత్యేక ప్రకటనలో.. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్రూడో, అతని మంత్రులతో సహా 313 మంది కెనడియన్లపై శిక్షాత్మక చర్యలను ప్రకటించింది. అదే విధంగా.. ఇత‌ర దేశాలు కూడా ఉక్రెయిన్‌లో రష్యా సైనిక జోక్యానికి తీవ్రంగా ఖండించాయి. ప్రతిస్పందనగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌లను నిషేధించింది. ఇలా ఆంక్షలను విధించ‌డం వ‌ల్ల‌.. రష్యాను ఆర్థికంగా ఇబ్బందుల‌కు గురి చేయాల‌ని ప్ర‌పంచ‌దేశాలు భావిస్తున్నాయి. 

ఈ చ‌ర్య‌ల‌కు ప్ర‌తి చ‌ర్య‌గానే నేడు అమెరికా పై ర‌ష్యా ఆంక్షాలు విధించింది. వ్యక్తిగత ఆంక్షలు "పరస్పరత సూత్రం" ఆధారంగా ఉంటాయని పేర్కొంది. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ US ఛైర్మన్ మార్క్ మిల్లీ, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివాన్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ విలియం బర్న్స్ ,వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకీ పై రష్యా ఆంక్షాలు విధించింది.

అలాగే.. నిషేద విధించిన జాబితాలో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దలీప్ సింగ్, యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ చీఫ్ సమంతా పవర్, డిప్యూటీ ట్రెజరీ సెక్రటరీ అడెవాలే అడెయెమో, యుఎస్ ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ చీఫ్ రెటా జో లూయిస్ కూడా ఉన్నారు.

బిడెన్ కుమారుడు హంటర్, మాజీ విదేశాంగ కార్యదర్శి, డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌లపై రష్యా నిషేధం విధించింది. ర‌ష్యా ఏంట్రీ గురించి.. ఆంక్ష‌లు విధించింది. అలాగే.. US అధికారులు, సైనిక అధికారులు, చట్టసభ సభ్యులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రముఖులు ఉన్న‌త‌ శ్రేణి నాయ‌కుల‌పై ర‌ష్యా త్వరలో అదనపు ఆంక్షలను ప్రకటిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

మరోవైపు.. దాదాపు మూడు వారాలుగా (20 రోజులు) ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకూ వందలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ అధికారిక గణాంకాల మేరకు.. ఈ యుద్దంలో 90 మంది చిన్నారులు మృతి చెందారు. మరో 100 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 30 లక్షల మంది ప్రజలు ఉక్రెయిన్ దేశాన్ని వీడి ప్రాణాలు చేతబట్టుకుని ఇతర దేశాలకు తరలిపోయినట్లు ఐక్యరాజ్య సమితి(ఐరాస) అంచనా. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో వందలాది మంది మరణించగా.. వేలాది మంది తమ కుటుంబాలతో విడిపోయారని తెలిపింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల్లో సానుకూల పరిష్కారం లభించాలని పలు దేశాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి.