రష్యాకు తానే ప్రథమ టార్టెట్ అని  ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు. తన తర్వాత తన కుటుంబాన్ని రష్యా లక్ష్యంగా చేసుకొందని ఆయన వివరించారు. 


కీవ్: Russia కు తానే ప్రథమ Target అని, ఆ తర్వాత తన కుటుంబం రెండో టార్గెట్ అని Ukraine అధ్యక్షుడు Zelensky చెప్పారు. Kviv నగరాన్ని రష్యన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకొన్నాయని జెలెన్ స్కీ శుక్రవారం నాడు ప్రకటించారు. తాను కీవ్ నగరంలోనే ఉంటానని ఆయన చెప్పారు. 

గురువారం నాడు తెల్లవారుజాము నుండి ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది. ఒక రోజు తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి రష్యా దళాలు ప్రవేశించాయి. సుమారు 136 మంది రష్యా దాడిలో మరణించారు. 

ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా రష్యా ఆర్మీ దాడి చేస్తోందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. కీవ్ నగరానికి ఉత్తరాన ఉన్న చెర్నోబిల్ అణు విద్యత్ ప్లాంట్ ను రష్యా దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. బెలారస్ నుండి ఉక్రెయిన్ లోకి రష్యా దళాలు ప్రవేశించాయి.

రష్యా తనను నెంబర్ వన్ లక్ష్యంగా పెట్టుకొందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. తన తర్వాత తన కుటుంబాన్ని నాశనం చేయడం రష్యా లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ ను రాజకీయంగా నాశనం చేయాలని అనుకొంటున్నారని జెలెన్ స్కీ చెప్పారు.తాను రాజధానిలోనే ఉంటాను, తన కుటుంబం కూడా ఉక్రెయిన్‌లోనే ఉందని జెలెన్ స్కీ వివరించారు. రష్యా ప్రజలను కాపాడేందుకే ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ ప్రారంభించినట్టుగా పుతిన్ ప్రకటించారు.

రష్యా దళాలతో తమ దేశ సైన్యం భీకరంగా పోరాటం చేస్తుందని జెలెన్ స్కీ చెప్పారు. గురువారం నాడు తెల్లవారుజాము నుండి ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది. గురువారం నాడు ఉదయం నుండి రష్యా ఉక్రెయిన్ పై దాడిని తీవ్రతరం చేస్తుంది.

జనావాసాలపై కూడా రష్యా దాడులు చేస్తోందని భారత్ లోని ఉక్రెయిన్ రాయబారి గురువారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. మరో వైపు సుమారు లక్ష మంది ప్రజలు పారిపోయారు. 137 మంది మరణించారని జెలెన్ స్కీ శుక్రవారం నాడు ఉదయం ప్రకటించారు. అంతేకాదు 316 మంది గాయపడ్డారని చెప్పారు. కీవ్ సమీపంలోని వంతెనను రష్యన్ దళాలు ఉపయోగించకుండా నిరోధించేందుకు వీలుగా పేల్చివేశారు.

శుక్రవారం నాడు తెల్లవారుజామున Kyiv లో వరుస పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవతా థృక్పథంతో 20 మిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్టుగా ప్రకటించింది. UNOసెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ ఈ విషయాన్ని గురువారం నాడు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ నుండి రూ. 20 మిలియన్ డార్లను తూర్పు లుహాన్స్క్ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని అవసరమైన కార్యకలాపాలకు వినియోగిస్తామని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

నగరాలు, సైనిక స్థావరాలు, వైమానిక దాడుల తర్వాత కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకొనేందుకు రష్యా దళాలు ముందుకు వెళ్తున్నాయి. ఉక్రెయిన్ పై దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ Putin సమర్ధించుకొన్నారు. గంట గంటకు ఉక్రెయిన్ పై రష్యా పట్టు సాధిస్తుంది. ఉక్రెయిన్ లోని నగరాలపై రష్యా దళాలు పట్టు సాధిస్తున్నాయి.