Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ పై కొనసాగిస్తున్న దాడిలో మొత్తం 118 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
North Atlantic Treaty Organization: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ఆపాలని ఐరాసతో పాటు చాలా దేశాలు కోరుతున్నాయి. అయితే, ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ లోని పెద్ద సంఖ్యలో సైనిక స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు సైనిక బలగాలు కీవ్ నగరంలోకి ప్రవేశించాయి. శనివారం నాడు ఉక్రెయిన్ దాడిపై స్పందించిన రష్యా.. ఇప్పటివరకు ఉక్రెయిన్ లోని 118 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. వాటిలో పదకొండు మిలిటరీ ఎయిర్‌ఫీల్డ్‌లు, 13 కమాండ్ పోస్ట్‌లు, ఉక్రేనియన్ సాయుధ దళాల కమ్యూనికేషన్ సెంటర్లు, 14 S-300, ఓసా యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థలు, 36 రాడార్ స్టేషన్లు ఉన్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, ఉక్రెయిన్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలు, ఒక హెలికాప్టర్, ఐదు డ్రోన్‌లు కూల్చివేయబడ్డాయనీ, ఇప్పటివరకు డజన్ల కొద్దీ వాహనాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది.
అలాగే, కొనాషెంకోవ్ చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్.. రష్యన్ నియంత్రణను ధృవీకరించింది. రెండు వైపుల సైనికులు విద్యుత్ యూనిట్లు మరియు సార్కోఫాగస్‌ను సంయుక్తంగా రక్షించడానికి అంగీకరించాయని రష్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. అణు విద్యుత్ ప్లాంట్ ప్రాంతంలో రేడియోధార్మిక సాధారణంగానే ఉందని తెలిపింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు రష్యా సాయుధ బలగాలను "ఉక్రేనియన్ దళాలతో గౌరవప్రదంగా ప్రవర్తించాలనీ, ఆయుధాలు విడిచిపెట్టిన సైనికుల కోసం భద్రతా కారిడార్‌లను రూపొందించాలని" ఆదేశించారు. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా పెద్ద మొత్తంలో ప్రాణ, ఆర్థిక నష్టం జరుగుతున్నదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. యుద్ధం ఆపాలని చాలా దేశాలు కోరుతున్నాయి. నాటో దేశాలైతే తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి.
ఇదిలావుండగా, అంతకుముందు ఉక్రెయిన్ సైనికబలగాలు లొంగిపోతే చర్చలకు సిద్ధమని రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, రష్యా దాడిని కొనసాగిస్తూనే ఇలాంటి ప్రకటనలు చేస్తుండటంతో ఉక్రెయిన్ బలగాలు దాడులను ప్రతిఘటిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితులు మరింతగా దిగజారుతుండటంతో ఉక్రెయిన్.. కాల్పుల విరమణ, శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇదిలావుండగా, రష్యా తీరును ఖండిస్తూ.. ఐరాస అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. ఐక్య రాజ్య సమితిలోని భద్రతా మండలిలో అమెరికా, అల్బేనియా దేశాలు కలిసి ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్దానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే, ప్రపంచ దేశాలు హెచ్చరికలను రష్యా ఏమాత్రం లెక్కచేయడం లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అమెరికా.. రష్యాకు కళ్లెం వేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పిటికే అనేక ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే రష్యా తీరును ఖండిస్తూ.. ఐరాస అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. ఐక్య రాజ్య సమితిలోని భద్రతా మండలిలో అమెరికా, అల్బేనియా దేశాలు కలిసి ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్దానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మాణాన్ని భద్రతా మండలిలో సభ్యులుగా ఉన్న 15 దేశాల్లో 11 దేశాలు ఆమోదించాయి. అయితే భారత్, చైనా, యూఏఈలు ఈ ఓటింగ్ దూరంగా ఉన్నాయి.
