బీజింగ్: చైనాలోని జియాంగ్సు ప్రోవిన్సులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు, ట్రక్ ఢీకొన్న సంఘటనలో 36 మంది మరణించగా, మరో 36 మంది గాయాలపాలయ్యారు. గాయాలపాలైన 36మందిలో మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. 

క్షతగాత్రులందరిని ఆసుపత్రుల్లో చేర్చి వైద్యసేవలందిస్తున్నామని, మెరుగైన సేవలు అవసరమైన వారిని పెద్ద ఆసుపత్రులకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. వేగంగా ప్రయాణిస్తున్న బస్సు ఎడమ టైర్ ఒక్కసారిగా పేలడంతో బస్సు అదుపు తప్పిందని అందువల్ల ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు అధికారులు. 

చాంగ్ చున్  - షేన్ జెన్ ఎక్ష్ప్రెస్ వే రోడ్డుపై ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపుగా 8 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ మధ్యకాలంలో అక్కడి ఎక్స్ప్రెస్ వేలపై ప్రమాదాలు ఎక్కువయ్యాయి.