మధ్య ఆఫ్రికా దేశమైన కామెరూన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 53మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మరో 21మంది క్షతగాత్రులయ్యారు. కామెరూన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న శాంక్చు గ్రామం వద్ద ఈ  రోడ్డు ప్రమాదం జరిగింది. 

ప్రయాణికులతో వెళుతున్న బస్సును అక్రమంగా ఆయిల్‌ తరలిస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 53 మంది మరణించారని, మరో 21 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.  ట్రక్కులోని ఆయిల్‌ బస్సుపై పడి నిప్పు అంటుకోవడంతో  ప్రమాదం జరిగింది. దీంతో దహనమయ్యింది. 

అయితే ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతన్ని అరెస్టు చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రమాదంలో మరణించిన వారి శరీరాలు తీవ్రంగా కాలి పోయాయని, గుర్తించడం కూడా కష్టంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.