తీరా చివరలో ఇచ్చిన బిల్లు చూసి వారికి దిమ్మ తిరిగిపోయింది. బిల్లు ఏకంగా దాదాపు రూ.లక్ష విధించడం గమనార్హం. అయితే, ఆ రెస్టారెంట్ తమను మోసం చేస్తోందని అర్థం చేసుకున్న ఆ స్టూడెంట్స్ అందుకు తగిన బుద్ది చెప్పారు.
మనలో చాలామంది భోజనం చేయడానికి అప్పుడప్పుడు రెస్టారెంట్స్ కి వెళుతూ ఉంటాం. ఇక వేరే ప్రాంతాలకు టూరిస్ట్ లుగా వెళ్లినప్పుడు తప్పనిసరిగా అక్కడ ఉన్న రెస్టారెంట్లలో భోజనం చేయాల్సి రావచ్చు. నలుగురు విద్యార్థులకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. భోజనం చేయడానికి రెస్టారెంట్ కి వెళ్లి మీల్స్ ఆర్డర్ చేసుకున్నారు. తీరా చివరలో ఇచ్చిన బిల్లు చూసి వారికి దిమ్మ తిరిగిపోయింది. బిల్లు ఏకంగా దాదాపు రూ.లక్ష విధించడం గమనార్హం. అయితే, ఆ రెస్టారెంట్ తమను మోసం చేస్తోందని అర్థం చేసుకున్న ఆ స్టూడెంట్స్ అందుకు తగిన బుద్ది చెప్పారు. ఈ సంఘటన ఇటలీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జపాన్ కి చెందిన నలుగురు విద్యార్థులు టూర్ కి ఇటలీ వెళ్లారు. అక్కడి అందాలను చూసి మురిపోయారు. ఓ రోజు భోజనం కోసం వారు అక్కడ ఓ ప్రముఖ రెస్టారెంట్ కి వెళ్లారు. భోజనంలో వారు నాలుగు ప్లేట్ల స్లీక్, ఒక వాటర్ బాటిల్, ఫ్రైడ్ ఫిష్ ఆర్డర్ చేశారు. ఫుడ్ ఎంజాయి చేసిన తర్వాత బిల్లు చూసి వారు షాకయ్యారు. దాదాపు రూ.లక్ష బిల్లు వేశారు. అసలు తాము తిన్నది ఎంత, వచ్చిన బిల్లు ఎంతో అర్థం కాలేదు వారికి. బిల్ గురించి రెస్టారెంట్ ఉద్యోగులను నిలదీశారు. అయితే రెస్టారెంట్ సిబ్బంది చెప్పి విషయం విని విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఇంటర్నెట్ హాట్‌స్పాట్, ఇతరత్రా సౌకర్యాల పేరుతో అధికంగా హిడెన్ ఛార్జీలు వేశారని తెలుసుకున్నారు. దీంతో.. బిల్లు చెల్లించక తప్పలేదు. డబ్బులు కట్టేసి అక్కడి నుంచి బయటకు వచ్చారు.
కానీ, ఇలాంటి హిడెన్ ఛార్జీలు విధించడం కరెక్ట్ కాదని భావించిన ఆ విద్యార్థులు ఇదే విషయంపై న్యాయ పోరాటం చేశారు. వెంటనే ఈ హిడెన్ ఛార్జీలపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా, రెస్టారెంట్ ని ఇరికించారు. దీంతో, రెస్టారెంట్ యాజమాన్యం దిగిరావాల్సి వచ్చింది. పరిహారం కింద నలుగురు విద్యార్థులకు రూ. 12.5 లక్షలు పరిహారం ఇప్పించారు. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ విద్యార్థులు చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
