ఇస్లామాబాద్:బాలీవుడ్ సినీ నటి ప్రియాంక చోప్రాపై పాక్ దృష్టి పడింది.  తమ అంబాసిడర్ ను ఉన్న ప్రియాంక చోప్రాను తొలగించాలని పాక్ మానవ వనరుల శాఖ మంత్రి ఐక్యరాజ్యసమితికి బుధవారం నాడు లేఖ రాశారు.

కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ప్రియాంక చోప్రా బహిరంగంగా మద్దతు పలికారు.అంతేకాదు భారత రక్షణమంత్రి అణ్వాయుధాల విషయంలో చేసిన వ్యాఖ్యలకు కూడ ఆమె మద్దతు ఇచ్చిన విషయాన్ని మంత్రి షిరిన్ మజరీ ఆ లేఖలో ప్రస్తావించారు.

ప్రియాంక చోప్రా వ్యవహారశైలి ఐక్యరాజ్యసమితి శాంతి నియమాలకు విరుద్దంగా ఉందని ఆ లేఖలో మంత్రి ప్రస్తావించారు. వెంటనే ప్రియాంక చోప్రాను అంబాసిడర్ గా తొలగించాలని కోరారు.

ఇదే విషయమై అమెరికాలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాకిస్తాన్ కు చెందిన ఓ మహిళ ప్రియాంక చోప్రోను ప్రశ్నించారు. ఒక దేశానికి మద్దతుగా నిలిచిన నీవు ఐక్యరాజ్యసమితి అంబాసిడర్ గా ఎలా ఉంటావని ఆమె ప్రశ్నించారు.అయితే తన వ్యాఖ్యల వల్ల ఎవరినైనా బాధిస్తే క్షమించాలని ప్రియాంక  కోరారు.