వడ్డీ రేట్ల పెంపు విషయంలో సెంట్రల్ బ్యాంకులు నిర్ణయాలు తీసుకోవడంతో కొన్ని ఆసియా దేశాల ఆర్ధి వ్యవస్థలో ఆర్దిక మాంద్యం ప్రమాదం పెరుగుతుంది. ఈ మేరకు ఆర్ధికవేత్తల సర్వేలు చెబుతున్నాయి.
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల పెంపు విషయంలో సెంట్రల్ బ్యాంకులు నిర్ణయాలు తీసకోవడంతో కొన్ని ఆసియా దేశాల ఆర్ధిక వ్యవస్థల్లో Recession ప్రమాదం పెరుగుతుంది..ఈ మేరకు ఆర్దిక వేత్తల సర్వేలు చెబుతున్నాయి.
Asia లోని శ్రీలంకలో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఈ సర్వే నివేదికలు చెబుతున్నాయి. వచ్చే ఏడాదిలో శ్రీలంక 85 శాతం మాంద్యంలో పడే అవకాశం ఉందని ఈ సర్వే నివేదిక చెబుతుంది. గతంలో ఇదే సర్వే ఆర్ధిక మాంద్యం 33 శాతంగా ఉంటుందని తెలిపింది. న్యూజిలాండ్, తైవాన్, అస్ట్రేలియా, ఫిలిప్పిన్స్ లలో కూడా మాంద్యం వచ్చే అవకాశాలున్నాయని ఈ సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఆయా దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. న్యూజిలాండ్ 33 శాతం, తైవాన్ లో 20 శాతం, అస్ట్రేలియాలో 20 శాతం, పిలిఫిన్స్ లో 8 శాతం మాంద్యం వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
అయితే గతంలో ఉన్నట్టుగా కొన్ని దేశాల్లో మాత్రం ఆర్ధిక మాంద్యంపై సర్వే ఫలితాలు మారలేదు. చైనా దేశం ఆర్ధిక మాంద్యంలోకి వచ్చే అవకాశాలు 20 శాతంగా ఉన్నాయి. దక్షిణ కొరియా, జపాన్ లు కూడా ఆర్ధిక మాంద్యంలోకి వెళ్లే అవకాశాలు 25 శాతంగా ఉన్నాయని సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.
పెరుగుతున్న ఇంధన ధరలు జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలను ఎక్కువగా దెబ్బతీశాయని ఈ సర్వే అభిప్రాయపడింది. స్పిల్ ఓవర్ ప్రభావం ఆ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని మూడీస్ అనలిటిక్స్ ఇంక్ లో చీఫ్ ఆసియా పసిఫిక్ ఆర్ధికవేత్త స్టీవెన్ కోక్రాన్ చెప్పారు. సాధారణంగా ఆసియాలో మాంద్యం ప్రభావం 20 నుండి 25 శాతంగా ఉంటుందని స్టీవెన్ చెప్పారు. మరో వైపు యూరప్ లో 50 నుండి 55 శాతంగా, అమెరికాలో 40 శాతంగా ఉండే అవకాశం ఉందన్నారు.వచ్చే 12 నెలల్లో అమెరికా మాంద్యం 30 శాతంగా ఉండే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతుంది. కొన్ని నెలల ముందు యూఎస్ ఆర్ధిక మాంద్యం సున్నాగా ఉండేది.
