Asianet News TeluguAsianet News Telugu

అభినందన్ క్షేమం... అప్పగింతపై చర్చలు జరుపుతున్నాం: పాక్

ప్రమాదవశాత్తూ పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించిన  భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్థమాన్ క్షేమ సమాచారంపై భారతప్రభుత్వంతో పాటు భారతీయులు ఆందోళనగా ఉన్నారు. 

ready To talk terms iaf pilot abhinandan varthaman release: shah mahmood qureshi
Author
Islamabad, First Published Feb 28, 2019, 2:52 PM IST

ప్రమాదవశాత్తూ పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించిన  భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్థమాన్ క్షేమ సమాచారంపై భారతప్రభుత్వంతో పాటు భారతీయులు ఆందోళనగా ఉన్నారు. పైకి ఏం పర్లేదు అంటున్నా పాక్ ఆర్మీ  ఆయనను ఏం చేస్తారోనని గత అనుభవాల దృష్ట్యా భారత్ కంగారుపడుతోంది.

ఈ నేపథ్యంలో తమ నిర్బంధంలో ఉన్న అభినందన్ క్షేమంగా ఉన్నారంటూ పాక్ విదేశాంగ మంత్రి షా మహద్మ్ ఖురేషి వెల్లడించారు. ఆయనకు మందులు, ఆహారం  విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

జెనీవా ఒప్పందంపై తమకు పూర్తి అవగాహన ఉందని, పాకిస్తాన్ అదుపులో ఉన్న అభినందన్‌ ఆరోగ్యం  విషయంపై శ్రద్ద తీసుకుంటున్నామని ఖురేషి పేర్కొన్నారు. మరోవైపు అభినందన్‌ను క్షేమంగా అప్పగించాలని భారత ప్రభుత్వం... పాకిస్తాన్‌కు విజ్ఞప్తి చేసింది.

దీనిపై పాక్ నిండు మనసుతో ఆలోచిస్తుందని... తాము బాధ్యతాయుత దేశమనే సందేశం భారత ప్రజలకు పంపాలన్నదే తమ అభిమతమని చెప్పుకొచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios