పొగాకు అలవాటు మానాలనుకుంటున్నారా? కానీ మానలేకపోతున్నారా? అయితే ఈ యాప్ మీకోసమే రూపొందించబడింది. ప్రపంచఆరోగ్య సంస్థ క్విట్ టొబాకో యాప్ అనే కొత్తరకం యాప్ ను లాంచ్ చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం ఓ కొత్త app ను లాంచ్ చేసింది. పొగాకు అలవాటును దూరం చేయడానికి ‘Quit Tobacco App’ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా Cigarettesలాంటి పొగవచ్చే ఉత్పత్తులతో పాటు, పొగరాని కొత్తరకాల పొగాకు ఉత్పత్తులతో పాటు.. అన్నిరకాల పొగాకు సంబంధిత ఉత్పత్తులను మానడానికి సాయం చేస్తుంది.
ఈ యాప్ లాంచ్ వేడుకలో మాట్లాడుతూ.. ‘tobaccoను ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదమే. పొగాకు చేసే చెడు గురించి దానివల్ల వచ్చే ప్రమాదం, ఆరోగ్య సమస్యల గురించి తెలిసినా మానలేని వారికి ఈ యాప్ చాలా ఉపయోగంగా ఉంటుంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంత రీజనల్ డైరెక్టర్ డా. పూనమ్ కేత్రపాల్ సింగ్ అన్నారు.
ఇలా ఓ యాప్ ను లాంచ్ చేయడం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఇదే మొదటిసారని తెలిపారు. అన్ని రకాల పొగాకు అలవాట్లను మాన్పించేలా చేసే ఒకే యాప్ ఇదే కావడం కూడా మొదటిసారి అన్నారు. ఈ యాప్ ను వాడేవారికి ఇది ఎంతో ఉపయోగంగంగా ఉంటుందని.. వారికి టార్గెట్లు నిర్ణయించి, పొగాకు తాగాలనే కోరికను క్రమంగా తగ్గిస్తూ... పొగాకు అలవాటు మానాలన్న వారి లక్ష్యం మీద దృష్టి పెట్టేలా చేస్తుందన్నారు.
యేటా దాదాపు 8 మిలియన్ల మంది పొగాకు సంబంధిత ఉత్పత్తుల వాడకం వల్ల చనిపోతున్నారు. అంతేకాదు ఒక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతంలోనే 1.6 మిలియన్ల మంది ఉన్నారని... ప్రపంచంలోనే పొగాకు ఉత్పత్తుల భారీ ఉత్పత్తిదారులు, వినియోగదారులున్న ప్రాంతాల్లో ఇది ఒకటి అని తెలిపింది.
పొగాకు వల్ల non-communicable diseases అయిన క్యాన్సర్, హృదయ సంబంధిత వ్యాధులు, ఊపిరి తిత్తుల వ్యాధులు, డయాబెటిస్ బారి పడే ప్రమాదం ఉంది. అంతేకాదు అంటువ్యాధుల్లో తీవ్రంగా పరిగణిస్తున్న కోవిడ్ 19 బారిన పడే అవకాశాలూ అధికంగానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. అందుకే పొగాకు అలవాటును తగ్గించాలన్న లక్ష్యంతో... NCD వ్యాధుల్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో ఈ యాప్ ను ప్రవేశపెట్టారు.
అనేక దేశాలు పొగాకు నియంత్రణకు, వాటి వాడకం, ఉత్పత్తిని తగ్గించడానికి WHO తీసుకుంటున్న, చేస్తున్న పనులకు సహాయసహకారాలు అందిస్తున్నాయి. దీని వల్ల పొగాకు డిమాండ్, సరఫరాను తగ్గించడానికి .. పొగాకు మహమ్మారి వల్ల వచ్చే సమస్యల్ని పరిష్కరించడానికి సహకారం అందిస్తున్నాయి.
2000-2025 (4వ ఎడిషన్, 2021) పొగాకు వినియోగం ధోరణులపై WHO గ్లోబల్ నివేదిక ప్రకారం, WHO ఆగ్నేయ ఆసియా ప్రాంతం పొగాకు వినియోగంలో అత్యంత వేగంగా క్షీణతను నమోదు చేసింది, అయితే అత్యధికంగా 432 మిలియన్ల పొగాకు వినియోగదారులను లేదా దాని జనాభాలో 29% మంది పొగాకు వినియోగదారులు ఉండడం విస్మయానికి గురి చేస్తోంది.
ఈ ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా 355 మిలియన్ల మందిలో 266 మిలియన్ల పొగలేని పొగాకు వినియోగదారులు ఉన్నారు. ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్/ఇ-సిగరెట్లు, షీషా/హుక్కా వంటి కొత్త రకం, అభివృద్ధి చెందుతున్న ఉత్పత్తుల వినియోగం అనేది పొగాకు నియంత్రణకు అదనపు సవాళ్లుగా మారాయి.
పొగాకు వినియోగం, వ్యాప్తి, పొగాకు నియంత్రణ విధానాలను పర్యవేక్షించడానికి ఆగ్నేయాసియా ప్రాంతం పొగాకు నిఘాను విస్తరించింది. సాదా ప్యాకేజింగ్‌ను అమలు చేసిన ఆసియా ప్రాంతంలో థాయిలాండ్ మొదటిది. తైమూర్-లెస్టే, నేపాల్, మాల్దీవులు, భారత్, శ్రీలంక పొగాకు ఉత్పత్తు ప్యాకేజీల మీద పెద్ద-పరిమాణంలో రోగ్య హెచ్చరికలను ముద్రించడం.. అమలు చేశాయి. ఆరు దేశాలు ENDS (ఎలక్ట్రానిక్ సిగరెట్లను) నిషేధించాయి.
బంగ్లాదేశ్, భారతదేశం, ఇండోనేషియా, శ్రీలంక పొగాకు రైతులను పొగాకు సాగు నుండి దూరం చేయడానికి కృషి చేస్తున్నాయి. భూటాన్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, తైమూర్-లెస్టే పొగాకు వాడకాన్ని వదిలించునేందుకు సాయం చేసే సేవలను స్థాపించాయి. ఇదివరకు ఉన్నవాటిని పెంచాయి. ఈ ‘WHO క్విట్ టుబాకో యాప్’ అనేది డబ్ల్యూహెచ్‌ఓ ఏడాది పొడవునా చేస్తున్న ''కమిట్ టు క్విట్'' క్యాంపెయిన్ లో కొత్తది. అంతేకాదు డబ్ల్యూహెచ్‌ఓ సౌత్-ఆసియా రీజియన్ ద్వారా చేపట్టిన సరికొత్త పొగాకు నియంత్రణ కార్యక్రమం.
