6న భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్.. పది కీలక ఒప్పందాలపై సంతకాలు
భారత్, రష్యాల వార్షిక ద్వైపాక్షిక సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం మన దేశానికి రానున్నారు. సోమవారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఉభయ దేశాల మధ్య పది కీలక ఒప్పందాలపై సంతకాలు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కాగా, ఇదే రోజు ఇరు దేశాల రక్షణ శాఖ, విదేశాంగ వ్యవహారాల మంత్రులు ముఖాముఖిగా సమావేశం కానున్నారు.
న్యూఢిల్లీ: భారత్, రష్యా(Russia)ల మధ్య 21వ వార్షిక ద్వైపాక్షిక సదస్సు సోమవారం ఢిల్లీలో జరగనుంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) సమావేశం కాబోతున్నారు. ఈ భేటీ కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం భారత్ రాబోతున్నారు. అంతకంటే ఒక రోజు ముందు అంటే ఆదివారం రాత్రి ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్, ఆ దేశ రక్షణ మంత్రి సెర్జి షోయ్‌గులు భారత్ చేరనున్నారు. ద్వైపాక్షిక సదస్సుతోపాటు ఉభయ దేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు సమావేశం కానున్నారు. ఈ ద్వైపాక్షిక సదస్సులో ఇరు దేశాల మధ్య సుమారు 10 కీలక ఒప్పందాలపై సంతకాలు పెట్టబోతున్నట్టు సమాచారం. రక్షణ, పర్యావరణ మార్పులు, వాణిజ్యం సహా ఇతర రంగాలకు చెందిన 10 ఒప్పందాలపై సంతకాలు పెట్టనున్నారు.
రష్యన్ ప్రెసిడెన్షియల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే, ఇందులో కొన్ని పాక్షిక రహస్య విషయాలూ ఉన్నాయని, మరికొన్నింటిపై ఇంకా కసరత్తులు జరుగుతున్నాయని తెలిపారు. అందుకోసమే ఆ ఒప్పంద వివరాలను పూర్తిగా ఇప్పుడే బహిర్గతం చేయలేని చెప్పారు. అయితే, ఈ ఒప్పందాలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత ధృడంగా మారుతాయని తెలిపారు. ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు పర్యటించే బృంద సభ్యుల సంఖ్యను తగ్గించినట్టు తెలిసింది. ఈ పర్యటనలో ఆ దేశా విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రితోపాటు రోస్నెఫ్ట్ సీఈవో ఇగోర్ సెచిన్, ఉషకోవ్‌లూ ఉంటారని సమాచారం.
Also Read: ఆపద్బాంధవుడు... ఇండియాకు రష్యా మరోసారి ఆపన్నహస్తం
సోమవారం సాయంత్రం 5.30 గంటలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య సమావేశం ప్రారంభం అవుతుంది. అనంతరం, సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వ్లాదిమిర్ పుతిని తిరిగి రష్యా వెళ్లిపోనున్నారు. రష్యా వర్గాల ప్రకారం, ఒమిక్రాన్ భయాందోళనల్లోనూ వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు స్వయంగా వెళ్లడానికి నిర్ణయించుకున్నాడని, ఇది కేవలం ఆ దేశంతో రష్యాకు ఉన్న అనుబంధం మాత్రమేనని తెలిపారు. ఈ సదస్సుకు ముందే భారత్‌లో రష్యాకు అనుకూలంగా కీలక నిర్ణయం ఒకటి వెలువడింది. భారత్, రష్యాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఏకే-203 కలష్నికోవ్ రైఫిల్స్ డీల్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమారు రూ. 5 వేల కోట్ల విలువైన డీల్ కోసం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కోర్వాలోని ఇండో రష్యన్ జాయింట్ వెంచర్.. ఏకే-203 రైఫిల్స్
తయారీకి అనుమతులు ఇచ్చింది.
కరోనాతో అల్లాడుతున్న సమయంలో భారత్‌కు సహాయం చేయడంపై చిరకాల మిత్ర దేశం రష్యా సానుకూలంగా వ్యవహరించింది. భారత్‌కు మెడికల్ ఆక్సిజన్, రెమ్‌డిసివర్ రెండింటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. వచ్చే 15 రోజుల్లోనే వాటిని భారత్‌కు పంపాలని మాస్కో నిర్ణయించినట్టు సమాచారం. వారానికి 3,00,000-4,00,000 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, అలాగే నౌక ద్వారా మెడికల్ ఆక్సిజన్‌ను పంపేందుకు రష్యా ముందుకొచ్చినట్టు జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది.