రష్యన్ రాజకీయాల్లో పుతిన్ ఆధిపత్యం గురించి అందరికి తెలిసిందే. అయితే పుతిన్ తన కుటుంబం గురించి బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు అరుదనే చెప్పాలి. ఆయన వ్యక్తిగత జీవితం, పిల్లల గురించి బయటి ప్రపంచానికి చాలా తక్కువగా తెలుసు.
ఉక్రెయిన్‌పై యుద్దాన్ని కొనసాగిస్తున్న రష్యాపై అమెరికా మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు కుమార్తెలపై ఆంక్షలను కఠినతరం చేయనున్నది. పుతిన్ మొదటి భార్య లియుడ్మిలా ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు Katerina Tikhonova, Maria Vorontsova. అయితే ఇప్పుడు అమెరికా వీరిపై ఆంక్షలు విధించాలనే యోచలో ఉండటంతో.. పుతిన్ కూతుళ్లు, కుటుంబం ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. రష్యన్ రాజకీయాల్లో పుతిన్ ఆధిపత్యం గురించి అందరికి తెలిసిందే. అయితే పుతిన్ తన కుటుంబం గురించి బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు అరుదనే చెప్పాలి. ఆయన వ్యక్తిగత జీవితం, పిల్లల గురించి బయటి ప్రపంచానికి చాలా తక్కువగా తెలుసు.
పుతిన్ తమ తండ్రి అని కాటెరినా, మరియాలు కూడా ఎప్పుడూ బహిరంగంగా ధ్రువీకరించలేదు. అయితే కాటెరిన్, మరియాల తల్లి లియుడ్మిలా ఒకప్పుడు national carrier Aeroflotలో air hostess పనిచేశారు. అయితే పుతిన్‌తో ఆమె వైవాహిక బంధం 2013లో విడాకులు తీసుకోవడంతో ముగిసింది. ప్రస్తుతం 35 ఏళ్ల కాటెరినా.. ఒక టెక్ ఎగ్జిక్యూటివ్‌గా కొనసాగుతున్నారని అమెరికా పేర్కొంది. ఆమె చేస్తున్న పని రష్యా ప్రభుత్వానికి, ఆ దేశ రక్షణ పరిశ్రమకు మద్దతునిస్తుందని తెలిపింది. ఇక, 36 ఏళ్ల మరియా.. క్రెమ్లిన్ నుండి బిలియన్ల డాలర్లను అందుకున్న ప్రభుత్వ నిధులతో కూడిన.. జన్యుశాస్త్ర పరిశోధన కోసం నిర్దేశించిన కార్యక్రమాలను ఆమె నాయకత్వం వహిస్తున్నారు. వీటిని పుతిన్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని అమెరికా పేర్కొంది. పుతిన్ ఆస్తులు కుటుంబ సభ్యుల వద్ద దాచినట్టుగా అమెరికా విశ్వసిస్తోందని ఆ దేశ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
క్రెమ్లిన్ వెబ్‌సైట్ డేటా ప్రకారం.. మరియా 1985లో జన్మించారు. ఆ తర్వాత ఏడాదికి కాటెరినా జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం అప్పుడు తూర్పు జర్మనీలో ఉన్న డ్రెస్డెన్‌కు మకాం మార్చింది. ఆ సయంలో పుతిన్ అక్కడ KGB గూఢచారిగా ఉన్నారు.
Mr Putin? సహ రచయిలతైన ఫియోనా హిల్, క్లిఫోర్డ్ గాడీలు.. పుతిన్ జీవిత చరిత్రలో.. ‘‘అటువంటి ప్రముఖ ప్రజా వ్యక్తికి వ్యక్తిగత సమాచారం చాలా తక్కువగా ఉంటుంది. అతని భార్య, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు.. పబ్లిక్ డొమైన్‌లో స్పష్టంగా కనిపించడం లేదు’ అని పేర్కొన్నారు.
కాటెరినా..
కాటెరినా చాలా ప్రాచుర్యం పొందిన వ్యక్తిగా చెబుతున్నారు. యూట్యూబ్‌లో అక్రోబాటిక్ రాక్ అండ్ రోల్ డాన్సర్‌గా ఆమె పేరు ప్రముఖంగా ఉంది. ప్రముఖ అంతర్జాతీయ పోటీలలో ఆమె ప్రదర్శించిన వీడియోలు ఉన్నాయి. అయితే.. రాయిటర్స్ వార్త సంస్థ చెబుతున్న విషయాలు ఆమెలోని భిన్నమైన కోణాన్ని ఆవిష్కరించేలా ఉన్నాయి. ఆమెకు మాస్కోలోని ప్రముఖలతో ఉన్న సంబంధాలు, మాస్కో ఉన్నతవర్గంపై ఆమె ప్రభావాన్ని హైలెట్ చేసింది.
కాటెరినా మాస్కో స్టేట్ యూనివర్శిటీలో ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యాథమెటికల్ రీసెర్చ్ ఆఫ్ కాంప్లెక్స్ సిస్టమ్స్‌కి ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్నట్టుగా ఆ నివేదిక తెలిపింది. పుతిన్‌కు చిరకాల మిత్రుడైన నికోలాయ్ షామలోవ్ కుమారుడు కిరిల్ షమలోవ్‌కు తాను భార్య అని కాటెరినా చెప్పినట్టుగా ఆ నివేదిక పేర్కొంది. పుతిన్, నికోలాయ్‌లు బ్యాంక్ రోసియాలో వాటాదారులుగా ఉన్నారు. మరోవైపు ఈ జంట కార్పొరేట్ హోల్డింగ్‌లు సుమారు 2 బిలియన్ల డాలర్లుగా విలువైనదిగా నివేదిక అంచనా వేసింది. ఇక, కిరిల్‌పై ఇప్పటికే ఆంక్షలు కొనసాగుతున్నాయి.
మరియా..
మరియా సెయింట్ పీటర్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రం, మాస్కో స్టేట్ యూనివర్శిటీలో వైద్యశాస్త్రం అభ్యసించారు. ఆమె జన్యు పరిశోధనపై ఎక్కువగా దృష్టి సారించారు. ఆమె డచ్ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారని.. కొంతకాలం నెదర్లాండ్స్‌లో నివసించారని రష్యన్, పాశ్చాత్య మీడియాలో నివేదికలు చెబుతున్నాయి. అయితే ఆ వివాహ బంధం ముగిసిందని.. ప్రస్తుతం జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ ప్రధాన వ్యూహకర్త లియోనిడ్ వోల్కోవ్
పుతిన్ సంపదను బహిర్గతం చేయడానికి నవల్నీ చాలా కాలం పాటు పనిచేశారని వోల్కోవ్ చెప్పారు. పుతిన్ కుటుంబంపై తాజా ఆంక్షలను స్వాగతిస్తున్నట్టుగా తెలిపారు. ఇక, రష్యాలో పుతిన్ సంపద ఎంత అనేది చాలా ఆసక్తికరమైన చర్చగా ఉంది. గతంలో నల్ల సముద్రంలోని ఒక సంపన్నమైన ప్యాలెస్‌కు పుతిన్ యజమాని అని నవల్నీ ఆరోపించారు. ఆ వీడియో కాస్తా యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. అయితే ఆ ఆరోపణలను.. గతేడాది క్రెమ్లిన్ తిరస్కరించింది.
క్రెమ్లిన్ అధికార ప్రతినిధి Dmitry Peskov ఫిబ్రవరిలో మాట్లాడుతూ.. పుతిన్ ఆస్తుల గురించి కొన్ని అసత్యమైన ప్రచారాలు ఉన్నాయని చెప్పారు. పుతిన్‌కు ఆయన ప్రకటించిన ఆస్తులు తప్ప.. ఇతర ఆస్తులు లేవు అని పెస్కోవ్ చెప్పారు. వారిద్దని.. మహిళలుగా పేర్కొన్న పుతిన్.. తన పిల్లలుగా గుర్తించలేదు. ఇక, చాలా ఏళ్ల కిందట ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “నేను వారి గురించి గర్విస్తున్నాను. వారు చదువును కొనసాగిస్తున్నారు.. పని చేస్తారు” అని చెప్పారు.
ఇక, 2020లో ఒక ఇంటర్వ్యూలో పుతిన్.. భద్రత అంశాల కారణం చూపి తన కుటుంబం గురించి ఎటువంటి సమాచారాన్ని పంచుకోవడానికి ఇష్టపడటం లేదని చెప్పారు. అయితే తనకు మనవళ్లు ఉన్నారని వెల్లడించారు. అయితే ఎంతమంది ఉన్నారనే విషయాన్ని మాత్రం తెలుపలేదు. “నాకు మనుమలు ఉన్నారు, నేను సంతోషంగా ఉన్నాను. వాళ్లు చాలా స్వీట్. నేను వారితో గడపడం చాలా ఎంజాయ్ చేస్తాను” అని పుతిన్ తెలిపారు.
మాజీ జిమ్నాస్ట్, పార్లమెంటేరియన్ అయిన అలీనా కబేవాపై కూడా ఆంక్షలు విధించాలని నవల్నీ బృందం కోరుతోంది. ఆమె పుతిన్ రెండవ భార్య, అతని ఇద్దరు చిన్న పిల్లల తల్లి అని వారు చెప్పారు. ఇక, అలీనా కబేవా రష్యా అతిపెద్ద మీడియా గ్రూప్ అయిన నేషనల్ మీడియా గ్రూప్‌కు కూడా అధ్యక్షురాలుగా ఉన్నారు.
