Asianet News TeluguAsianet News Telugu

పురిటినొప్పులతో సైకిల్‌పై హాస్పిటల్ వెళ్లిన ఎంపీ.. ప్రసవం.. ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్

నిండు గర్భిణి.. పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. రాత్రి సుమారు రెండు గంటల సమయం. అప్పుడు న్యూజిలాండ్ ఎంపీ ఏం చేశారంటే ఆమె తన సైకిల్‌పై స్వయంగా హాస్పిటల్‌కు బయల్దేరారు. హాస్పిటల్ చేరిన గంట తర్వాత ఆమె బేబీకి జన్మనిచ్చారు. తన మొదటి కాన్పు సమయంలోనూ ఆమె ఇలాగే సైకిల్‌పై హాస్పిటల్ వెళ్లి ఆశ్చర్యపరిచారు. ఈ సారి ప్రణాళికలేమీ లేనప్పటికీ చివరి నిమిషంలో హాస్పిటల్‌కు సైకిల్‌పై వెళ్లాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.
 

pregnant MP with pains went to hospital on bicycle
Author
New Delhi, First Published Nov 28, 2021, 1:48 PM IST

న్యూఢిల్లీ: సాధారణంగా గర్భిణులకు ఎనిమిది నెలలు నిండి తొమ్మిదో నెలలో అడుగు పెట్టినప్పటి నుంచే కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉంటుంటారు. ఏ క్షణంలోనైనా పురిటి నొప్పులు రావొచ్చని, హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికీ సర్వం సిద్ధం చేసి ఉంచుతారు. కానీ, ఆమె ఒక ఎంపీ. అయినప్పటికీ ఒకవైపు పురిటినొప్పులు వస్తున్నా.. సైకిల్‌పై హాస్పిటల్‌కు వెళ్లారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మరి ఆ న్యూజిలాండ్ ఎంపీ జూలి ఆన్ జెంటర్ కథ చూద్దామా?..

న్యూజిలాండ్ దేశంపై చాలా మందికి ఒక ప్రత్యేక అభిమానం ఉంటుంది. అక్కడి రాజకీయ నేతలూ డౌన్ టు ఎర్త్ అన్నట్టుగా ఉంటారు. ప్రజలూ చాలా వరకు నైతికతతో ప్రవర్తిస్తుంటారు. కరోనా పోరులోనూ ఆ దేశం అంతర్జాతీయంగా వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆ దేశ ఎంపీ జూలి ఆన్ జెంటర్ తన ప్రసవంతో మరోసారి న్యూజిలాండ్ స్టోరీని వార్తల్లోకి తెచ్చారు. ఆదివారం తెల్లవారు జామున ఆమెకు ఉన్నట్టుండి పురిటి నొప్పులు వచ్చాయి. ఆమె వెంటనే తన సైకిల్‌పై హాస్పిటల్ చేరుకున్నారు. హాస్పిటల్ చేరుకున్న గంట తర్వాత ఆమె బేబీకి జన్మనిచ్చారు. గతంలోనూ ఆమె తన తొలి కాన్పులోనూ ఇలాగే సైకిల్‌పై హాస్పిటల్‌కు చేరుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచేశారు. అయితే, ఈ సారి సైకిల్‌పై వెళ్లాలనే ప్రణాళికలేవీ చేసుకోలేదని, చివరి నిమిషంలో అలా వెళ్లాల్సి వచ్చిందని అన్నారు.

Also Read: హాస్పిటల్స్‌లో కూడానా... ఆస్పత్రుల్లో సెక్స్ వద్దని ప్రజలకు ప్రధాని వేడుకోలు

ప్రసవం అనంతరం ఆమె ఫేస్‌బుక్‌లో తన గుడ్ న్యూస్ పోస్టు చేశారు. ఈ రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో తమ కుటుంబంలో కొత్త సభ్యుడు వచ్చారని ఆమె పేర్కొన్నారు. హాస్పిటల్ వెళ్లడానికి తాను నిజానికి ప్లాన్ ఏమీ చేయలేదని పేర్కొన్నారు. అయితే, చివరి నిమిషంలో సైకిల్‌పై వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. హాస్పిటల్ కోసం ఇంటి నుంచి రాత్రి రెండు గంటల ప్రాంతంలో బయల్దేరినప్పుడు పురిటి నొప్పులు మరీ అంత తీవ్రంగా ఏమీ లేవని తెలిపారు.

ఇప్పుడు అంతా సంతోషమేనని, బేబీ హెల్తీగా ఉన్నదని, తానూ హెల్తీగా ఉన్నారని, ప్రసవం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగిందని సంబురపడిపోయారు. అంతేకాదు, ఆ బేబీని ఎత్తుకుని నిద్రపోతున్న తన భర్త ఫొటోనూ జత చేశారు. ఇప్పుడు వారిద్దరూ నిద్రిస్తున్నారని వివరించారు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. చాలా మంది ఆమె సైకిల్‌పై హాస్పిటల్‌‌కు వెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంతోషంగానూ ఫీల్ అయ్యారు. ప్రసవం కోసం సైకిల్‌పై వెళ్లడాన్ని కొందరు సమర్థించారు. సైకిల్‌పై వెళితే ప్రసవం సులువుగా జరుగుతుందని, అది ఒక టిప్ అంటూ ఇంకొందరు తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు.

Also Read: ఆమె తలుచుకుంది.. కరోనాను దేశం నుండే తరిమికొట్టింది.. ఎక్కడంటే...

మూడేళ్ల క్రితం కూడా జూలీ ఆన్ జెంటర్ ఇలాగే సైకిల్‌పై హాస్పిటల్‌కు వెళ్లారు. అప్పుడు కూడా సైకిల్‌పై వెళ్లి ప్రసవించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా అడార్న్ కూడా 2018లో ప్రధానిగా ఉండి గర్భం దాల్చాక మెటర్నిటీ లీవులు తీసుకుని ఆశ్చర్యపరిచారు. ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఆమె వెళ్లినప్పుడు పాలు మరవని తన మూడేళ్ల పాపను వెంట తీసుకెళ్లడం అప్పట్లో సంచలనం అయింది.

Follow Us:
Download App:
  • android
  • ios