Russia Ukraine War: ఐరోపా సమాఖ్య సమన్వయంతో పోలండ్ ప్రధానమంత్రి మేటియస్ మోరెవియకి, ఉప ప్రధాని యరస్లో కాచిన్స్కీ, చెక్ రిపబ్లిక్ ప్రధాని పెటర్ ఫీలా, స్లొవేనియా ప్రధాని యానెస్ జేన్సా లు మంగళవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించారు. ఉక్రెయిన్‌కు అందించనున్న సహాయం గురించి జెలెన్స్కీతో నేతలు చర్చించారు.
Russia Ukraine War: ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై గత 20 రోజులుగా రష్యా దాడులు చేస్తునే ఉంది. రష్యాన్ బలగాలు తొలుత సైనిక స్థావరాలు, ఆర్మీ గొడౌన్స్ టార్గెట్ చేసినా.. క్రమంగా ఆఫీసులు, అపార్ట్ మెంట్ బిల్డింగ్ లను ను సైతం టార్గెట్ చేస్తోంది. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో వందలాది మంది మరణించగా.. ఇప్పటివరకూ దాదాపు 30 లక్షల మంది ప్రజలు ఉక్రెయిన్ దేశాన్ని వీడి ప్రాణాలు చేతబట్టుకుని ఇతర దేశాలకు తరలిపోయినట్లు ఐక్యరాజ్య సమితి(ఐరాస) అంచనా. మరణహోమాన్ని వెంటనే ఆపివేయాలని ఇప్పటికే పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు హెచ్చరించాయి. అనేక దేశాలు రష్యాను తీరును ఖండించాయి. రష్యా బాంబులతో ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంటే.. ఇతర దేశాలు మాత్రం రష్యాపై ఆంక్షలు పెట్టి.. ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి.
ఈ తరుణంలో ఐరోపా సమాఖ్యకు చెందిన ముగ్గురు ప్రధానులు ఉక్రెయిన్‌కు బయల్దేరారు.పోలండ్ ప్రధానమంత్రి మేటియస్ మోరెవియకి, ఉప ప్రధాని యరస్లో కాచిన్స్కీ, చెక్ రిపబ్లిక్ ప్రధాని పెటర్ ఫీలా, స్లొవేనియా ప్రధాని యానెస్ జేన్సా లు మంగళవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించారు. రష్యా దాడుల నేపథ్యంలో ఈ నేతల ఉక్రెయిన్ పర్యటన చర్చనీయాశంగా మారింది. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని సమావేశమయ్యారు.
కైవ్: రష్యా దండయాత్ర తర్వాత ఉక్రెయిన్ ముట్టడిలో ఉన్న రాజధానికి విదేశీ నేతల మొదటి పర్యటనలో పోలిష్, చెక్ మరియు స్లోవేనియన్ ప్రధానులు మంగళవారం కైవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కలిశారు.రైలులో వచ్చిన పోలిష్, చెక్, స్లోవేనియన్ ప్రధానులు నగర దుస్థితిని వీక్షించారు. ఈ భేటీలో ఉక్రెయిన్ పరిస్థితిని , ప్రధాన నగరాలు ఎలా ధ్వంసమయ్యాయో తెలిపే ప్రయత్నం చేశారు జెలెన్స్కీ. ఈ క్రమంలో అతడు తన టెలిగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో చూపి.. పరిస్థితిని వివరించారు. వీలైనంత త్వరగా ఈ విషాదాన్ని ఆపడానికి కృషి చేశామని పోలండ్ ప్రధానమంత్రి మేటియస్ మోరెవియకి ఫేస్‌బుక్‌లో తెలిపారు. ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ "నిస్సందేహంగా మద్దతు" ఉందని ఆయన అన్నారు.
EU కౌన్సిల్ ష్మిహాల్ ఈ భేటీ అనంతరం స్పందిస్తూ.. ఉక్రెయిన్ ధైర్యాన్ని ప్రశంసించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నాయకులు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచారనీ, రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఆంక్షలను మరింత బలోపేతం చేస్తామని ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపారు. పోలాండ్ ప్రధాన మంత్రి మాటియుస్జ్ మొరావికీ ట్విట్టర్‌లో ఉక్రేనియన్ రాజధానికి తాను వస్తున్నట్లు ప్రకటించారు. యుద్ధంలో దెబ్బతిన్న కైవ్ చరిత్ర సృష్టించబడుతోంది. ఈ నగరంలోనే దౌర్జనంపై ప్రపంచ వ్యాప్తం స్వాతంత్ర పోరాటం జరిగింది. EU UA (ఉక్రెయిన్)కి మద్దతు ఇస్తుంది, ప్రపంచ దేశాల సహాయం, మద్దతు ఉంటుందని ప్రకటించారు. తమ చర్చలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడం, రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఆంక్షలను బలోపేతంపై సాగాయని తెలిపారు.
దాదాపు మూడు వారాల యుద్ధాన్ని కొనసాగుతూనే ఉంది. ఇరుదేశాల మధ్య మరోమారు శాంతి చర్చలు జరుగనున్న నేపథ్యంలో ఈ పర్యటన జరిగినట్టు తెలుస్తుంది. సమావేశ అనంతరం చెక్ రిపబ్లిక్ ప్రధాని పెటర్ ఫీలా మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు వచ్చే ఆయుధాల రవాణా, రష్యాకు వ్యతిరేకంగా అదనపు దౌత్యపరమైన చర్యల గురించి వారు చర్చించినట్లు చెప్పారు. పోలాండ్ ప్రధాని మాట్లాడుతూ.. తమ దేశ యొక్క 28 MiG-29 యుద్ధ విమానాలను ఉక్రెయిన్‌కు ఎలా అందించాలనే దానిపై చర్చినట్టు తెలిపారు. తమ దేశ సహయం ఉక్రెయిన్ కు ఉంటుందని తెలిపారు.
