తనతో పాటు పనిచేసే కుక్కపై ఓ పోలీస్ అధికారి అత్యాచారం చేయడంతో పాటు దానిని వీడియో తీశాడు. వివరాల్లోకి వెళితే.. లండన్‌కు చెందిన టెర్రీ ఎట్‌మాన్ ఎన్నో కేసులను ఛేదించి డిపార్ట్‌మెంటులో మంచి పేరు సాధించాడు.

అతని సేవలను గుర్తించిన ప్రభుత్వం టెర్రీకి ఎన్నో అవార్డులను, రివార్డులను ఇచ్చి గౌరవించింది. అయితే ఇంతటి నిజాయితీ గల అధికారిలో ఓ రాక్షసుడు దాగివున్న సంగతి బయట ఎవరికి తెలియదు.

అతను తనతో పాటు ఉద్యోగం చేసిన ఓ పోలీస్ కుక్కపై పలుమార్లు అత్యాచారం చేశాడు.. అక్కడితో ఆగకుండా దానిని వీడియో తీసేవాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం సదరు కుక్క రిటైర్ అయ్యింది.

దానికి అనారోగ్యం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. దానిని పరీక్షించిన వైద్యులు అసలు నిజం చెప్పడంతో టెర్రీ అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. అతను జంతువులపైనే కాకుండా, చిన్న పిల్లలను లైంగిక వేధించినట్లు తెలుస్తోంది.

అతని ఇంట్లో పోలీసులు జరిపిన సోదాల్లో కెమెరాలు, కంప్యూటర్లలో వందలమంది చిన్నారుల అసభ్యకర చిత్రాలున్నాయి. దీంతో చాలా మంది ప్రజలు టెర్రీని కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు తెలిపారు.

దీని కోసం దాదాపు 20 వేల మంది సంతకాలు చేసిన ఓ పిటిషన్‌ను జిల్లా న్యాయస్థానానికి అందజేశారు. మూగజీవాలను హింసించినందుకు గాను అతనికి కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.