Asianet News TeluguAsianet News Telugu

పాక్‌ కెప్టెన్‌పై లైంగిక ఆరోపణలు..ఎఫ్‌ఐఆర్‌ నమోదు..

పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దోపిడికి పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ చిక్కుల్లో పడ్డారు. లాహోర్‌లోని అదనపు సెషన్స్‌ కోర్టు బాబర్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

Police lodge FIR against Babar Azam after sexual exploitation complaint - bsb
Author
Hyderabad, First Published Jan 15, 2021, 12:40 PM IST

పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దోపిడికి పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ చిక్కుల్లో పడ్డారు. లాహోర్‌లోని అదనపు సెషన్స్‌ కోర్టు బాబర్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

గతేడాది నవంబర్‌లో లాహోర్‌కు చెందిన హమీజా ముక్తార్‌ అనే మహిళ, బాబర్‌ తనను పెళ్లాడతానని 2010లో ప్రపోజ్ చేశాడని చెప్పింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీరకంగా వాడుకున్నాడన్నది. ఆ తర్వాత తనను వదిలించుకోవాలని చూశాడని.. అంతేకాక ఓ సారి తనకు బలవంతంగా అబార్షన్‌ కూడా చేయించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో హమీజా‌ తరఫు న్యాయవాది ఇందుకు సంబంధించిన వైద్య పత్రాలను సాక్ష్యంగా కోర్టుకు సమర్పించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయూర్తి నోమన్ ముహమ్మద్ నయీమ్ బాబర్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా‌ నసీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓను ఆదేశించారు. 

ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు తీవ్రంగా, కలవరపరిచే విధంగా ఉన్నాయన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని గతంలో హమీజా ఆరోపించింది. దాంతో మరో అదనపు సెషన్స్ జడ్జి అబిద్ రాజా బాబర్, అతడి కుటుంబ సభ్యులను హెచ్చరించారు. 

నసీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో క్రికెటర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ప్రయత్నించినప్పుడు, వివాహ పునః భరోసాపై ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని బాబర్ తనను బలవంతం చేశాడని హమీజా ఆరోపించింది. బొటనవేలు గాయం కారణంగా న్యూజిలాండ్‌లో మొత్తం సిరీస్‌ను కోల్పోయిన బాబర్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్ టెస్ట్, టీ 20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios