పాకిస్తాన్ లో కుటుంబంపై విషప్రయోగం.. ఒకే కుటుంబానికి చెందిన 11మంది మృతి.. చిన్నారులు కూడా..
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి.
పెషావర్ : పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో కుటుంబకలహాలు ఓ నిండు కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. పిల్లలు, మహిళలు సహా ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. వీరంతా విషం తాగడం వల్ల చనిపోయారని అనుమానిస్తున్నారు. వీరంతా తమ ఇంట్లో చనిపోయారని బుధవారం పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రావిన్స్‌లోని లక్కీ మార్వాట్ జిల్లాలోని తఖ్తీ ఖేల్ పట్టణంలోని ఓ ఇంట్లో 11 మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లల మృతదేహాలను గమనించిన.. బాధితుల్లో ఒకరి సోదరుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
భారత్‌తో గొడవ : ఎక్కువ మంది పర్యాటకులను పంపండి.. చైనాను కోరిన మాల్దీవుల అధ్యక్షుడు
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. రెండు రోజుల క్రితం ఆహారంలో విషపూరితమైన పదార్థాన్ని తీసుకోవడం వల్లే ఈ దురదృష్టకర సంఘటన జరిగినట్లు స్థానిక పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
బాధిత కుటుంబానికి చెందిన ఓ బంధువు రెండు రోజుల క్రితం వజీరిస్థాన్ నుంచి ఆహారం కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు స్థానికుల సమాచారం.
కేర్‌టేకర్ ప్రొవిన్షియల్ చీఫ్ మినిస్టర్ జస్టిస్ (రిటైర్డ్) అర్షద్ హుస్సేన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుండి నివేదిక కోరారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని అన్నారు.