Asianet News TeluguAsianet News Telugu

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు అధికారిక వీడ్కోలు.. హాజరుకానున్న ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 27న జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మాజీ ప్రధాని షింజో అబేకు జపాన్ ప్రభుత్వం అధికారిక వీడ్కోలు పలకనున్న కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఈ మేరకువిదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన వెల్లడించింది. 

PM Modi to attend former Japanese PM Shinzo Abe  funeral on Sept 27
Author
First Published Sep 23, 2022, 7:02 AM IST

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కు అక్కడి ప్రభుత్వం అధికారిక వీడ్కోలు పలుకనున్నది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ  పాల్గొనున్నారు. ఈ మేరకు ఆయన సెప్టెంబర్ 27న జపాన్‌లో పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తెలుపుతూ..గురువారం ప్రకటనను వెల్లడించింది.  టోక్యోలోని కిటనోమారు నేషనల్‌ గార్డెన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం మోదీ జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదతో సమావేశమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ షింజో అబే అంత్యక్రియల కార్యక్రమం ఉందని, అది చాలా స్నేహపూర్వక దేశంలో ఉందని అన్నారు. ప్రధాని తన బిజీ షెడ్యూల్ నుండి సమయం కేటాయించి.. ఆ అంతిమ సంస్కారాల కార్యక్రమంలో పాల్గొనున్నారని తెలిపారు.అది వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన అంశం కూడా కావచ్చు కానీ దానిపై నేను వ్యాఖ్యానించడం సరికాదు' అని అన్నారు.

ఫ్యూమియో కిషిదాతో ప్రధాని మోదీ భేటీ 

ప్రధాని మోదీ తన పర్యటనలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ, అబే మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది. అబే మృతికి సంతాపం తెలిపిన మోడీ, ఆయనను "ప్రియమైన స్నేహితుడు" అని సంబోధించారు. జపాన్ మాజీ ప్రధాని దేశం కోసం  తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. అబే మృతి పట్ల ప్రధాని మోదీ ప్రత్యేక నివాళులర్పించారు. షింజో అబే జపాన్‌లో గొప్ప వ్యక్తి మాత్రమే కాదు, మహోన్నత  వ్యక్తిత్వం కలిగిన ప్రపంచ రాజకీయ నాయకుడు. అతను ఇండో-జపనీస్ స్నేహానికి గొప్ప మద్దతుదారు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అతని అకాల నిష్క్రమణ కారణంగా జపాన్‌తో పాటు ప్రపంచం మొత్తం గొప్ప దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయింది. నేను నా ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను. అని ప్రధాని పేర్కొన్నారు.

భారత్‌కు జపాన్‌ త్రదేశం. అబె అధికారంలో ఉన్న సమయంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి.2018లో మోదీ జపాన్ లో పర్యటించినప్పడు.. అబె..ప్రధాని మోడీని తన పూర్వీకుల నివాసానికి తీసుకెళ్లారు. ఈ ప్రత్యేక ఆహ్వానం.. ఇరువురి మధ్య ఆత్మీయబంధాన్ని నెలకొనేలా చేసింది.అలాగే క్వాడ్ సదస్సులో భాగంగా ఈ ఏడాది మేలో మోదీ మరోసారి ఆ దేశంలో పర్యటించారు. ఆ సందర్భంగా అబెను కలుసుకున్నారు.

జపాన్‌ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన షింజో అబే.. జూలై 8న నరా నగరంలోని ఓ వీధిలో లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో  ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అంత్యక్రియలు కూడా ముగిశాయి. కానీ అక్కడి ప్రభుత్వం సెప్టెంబర్ 27న అధికారిక వీడ్కోలు పలకాలని నిర్ణయించింది.రెండోప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌ నిర్వహిస్తోన్న రెండో అధికారిక వీడ్కోలు కార్యక్రమమిది. గతంలో ఇలాంటి అదురైన గౌరవం  1967లో మాజీ ప్రధాని షిగెరు యోషిదాకు దక్కింది

Follow Us:
Download App:
  • android
  • ios