అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఓ సింగిల్ ఇంజిన్ విమానం సముద్రంలో కుప్పకూలింది. దీంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న 8మంది గల్లంతయ్యారు. సహాయక చర్యల్లో ఇప్పటివరకు ఒక మృతదేహం లభించింది.
నార్త్ కరోలినా : అమెరికాలోనిNorth Carolinaలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎనిమిది మందితో ప్రయాణిస్తున్న చిన్న విమానం Atlantic Oceanలో కుప్పకూలింది. నార్త్ కరోలినా రాష్ట్రం ఔటర్ బ్యాంక్స్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇప్పటివరకు ఒక deadbodyని వెలికితీశారు. మిగిలిన వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం 1.35 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) హైడ్ కౌంటీ ఎయిర్ పోర్ట్ నుంచి పిలాటస్ పీసీ-12/47 అనే సింగిల్ ఇంజన్ విమానం టేకాఫ్ అయింది.
అయితే టేకాఫ్ అయిన 25 నిమిషాల తర్వాత Aircraftకు రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి. దాంతో విమానం సముద్రంలో కూలిపోయిందని నిర్ధారించుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. బోట్స్, హెలికాప్టర్లను రంగంలోకి దించి ముమ్మరంగా గాలించింది. ఆ క్రమంలో సముద్రంలో మూడు వేర్వేరు చోట్ల విమాన శకలాలు దొరికాయి.
అక్కడే కోస్ట్ గార్డ్ సిబ్బంది ఒక మృతదేహాన్ని కూడా గుర్తించింది. కాగా, విమానంలోని ఎనిమిది మందిలో ఎవరూ బతికి బయట పడే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. ప్రయాణికులందరూ కార్ టెరెట్ కౌంటీకి చెందిన వారని సమాచారం.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 5న Peru దేశంలో Tourist plane కుప్పకూలిన దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. ఏరోసాంటోస్ టూరిజం కంపెనీకి చెందిన సెస్నా 207 సింగిల్ ఇంజిన్ విమానం నజ్కా లోని మరియా రీచీ విమానాశ్రయం నుంచి Takeoff అయిన కొద్దిసేపటికి crashe అయి కుప్పకూలిపోయింది. పెరూలోని ప్రసిద్ధ Nazca linesను వీక్షించేందుకు వెళ్లిన వారి విమానం కూలిపోవడంతో ఐదుగురు పర్యాటకులు, ఇద్దరు పైలెట్లు మరణించారని పెరూ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
సెస్నా 207 సింగిల్ ఇంజన్ విమానంలో ఉన్న ఏడుగురిలో ఎవరూ ప్రాణాలతో లేరని అధికారిక వర్గాలు తెలిపాయి. విమానంలో ఉన్న ఏడుగురిలో ఇద్దరు చిలీ పర్యాటకులు ఉన్నారని దౌత్య అధికారి తెలిపారు. మరియా రీచ్ ఎయిర్ ఫీల్డ్ నుంచి డజన్ల కొద్దీ విమానాలు నడుస్తున్నాయి. విదేశీ పర్యాటకులు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన నాజ్కా లైన్ ల మీదుగా విమానాల్లో ప్రయాణిస్తూ వీక్షిస్తుంటారు. 2010లో అక్టోబర్ లో ఎయిర్ నాస్కా ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయినప్పుడు నలుగురు బ్రిటీష్ పర్యాటకులు, ఇద్దరు పెరూవియన్ సిబ్బంది మరణించారు.
