ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 పాసింజర్ విమానం రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి బయల్దేరింది.

అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ విమానం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఆ విమానంలో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. కూలిన విమానం ఆచూకిని కనుగొని సహాయక చర్యలు చేపట్టేందుకు గాను సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు.

మరోవైపు ఈ ప్రమాదంపై ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్ అహ్మద్ స్పందించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఆయన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.