కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. డగ్లస్ డీసీ-3 విమానం శాస్‌జోస్ డెల్ గౌవైరే, విల్లావిసెన్సియా పట్టణాల మధ్య ఆకస్మాత్తుగా కూలిపోయింది. కుప్పకూలిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంజిన్‌లో వైఫల్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో తరారీయా, డోరిస్ గ్రామాల మేయర్ ఆయన కుటుంబసభ్యులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.