సాధారణంగా ఫైటింగ్ చాంపియన్‌షిప్ పోటీలన్ని భయానకంగా ఉంటాయి. దిమ్మదిరిగే పంచ్‌లు, ఒకరిపై ఒకరి దాడి అనూహ్యంగా సాగుతుంటాయి. ఒక్కోసారి ఎదుటి వారు రక్తం కక్కుకుంటారు. కొందరు స్పృహ తప్పిపడిపోతారు. కానీ, ఇలాంటి భయానక పరిస్థితులేవీ లేకుండా.. కనీసం ఆ ప్లేయర్లు కూడా గాయపడని రీతిలో ఫ్లోరిడాలో ఓ ఫైటింగ్ టోర్నమెంట్ జరిగింది. తలగడలను చేతబట్టుకుని రింగ్‌లో కొట్లాడుకోవడమే ఆ పోటీ. మిగతా పోటీలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆ టోర్నమెంట్ ఉన్నది. కానీ, రక్తపాతం, గాయాలు ఉండవు.
న్యూఢిల్లీ: సాధారణంగా ఫైటింగ్ టోర్నమెంట్ అంటే పంచ్‌లు, అరుపులు, కేకలు, రక్తం, హింస ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు రక్తం కూడా వెలికి రావచ్చు. అలాంటి పోటీలు అన్నీ భయంకరంగా ఉంటాయి. వీక్షకులు కూడా.. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠతో ఉంటారు. కొన్నిసార్లు రింగ్‌లోని వ్యక్తులూ స్పృహ తప్పి పడిపోవడాన్ని చూస్తాం. ఇలాంటి పోటీలను కుటుంబం అంతా ఒక చోట కూర్చుని చూసే అవకాశం ఉండదు. హింస, రక్తపాతం వంటివి ఇందుకు అడ్డుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సరికొత్తగా ఒక ఫైటింగ్(Fighting) పోటీ వచ్చింది. ఇప్పుడు ఆ పోటీ విశేష ఆదరణ పొందుతున్నది.
చాలా మంది బాల్య మధుర స్మృతుల్లో తోబుట్టువులతో దిండుల (Pillows)తో కొట్లాడిన సందర్భాలు ఉంటాయి. దిండులతో చిన్నప్పుడు కొట్లాడటం సహజమే. కొంత వయసు వచ్చాక తలగడలతో పోరాడటం ఉండదు. కానీ, ఇప్పుడు ఆ తలగడలతో ఫైటింగ్ వయసు దాటి వచ్చింది. అది ఇప్పుడు కేవలం పిల్లలకు మాత్రమే అనే లిమిట్ చెరిపేసి ఏకంగా ఓ కంబాట్ స్పోర్ట్(Combat Sports)గా అవతరించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో దిండులు చేతబట్టుకుని ఫైటింగ్ చేసే పోటీ టోర్నమెంట్‌ను నిర్వహించారు. అంతేకాదు, ఆ పోటీలో విజయం సాధించిన ఫైటర్‌ను అధికారికంగా గుర్తించి బహుమానం అందించారు. ఈ టైటిల్ బెల్ట్ ప్రైజ్ మనీ సుమారు 3.75 లక్షలు.
ఈ పోటీ మిగతా కంబాట్ స్పోర్ట్‌లకు ఏమాత్రం తీసిపోదు. మిగతా పోటీల్లాగే ఈ పోటీ కూడా రింగ్‌లో గంభీరంగా జరుగుతుంది. పంచ్‌లు వేసుకుంటారు. కానీ, చేతులతో కాతు.. కేవలం దిండులతోనే. అదే తరహాలో ఎదుటి వ్యక్తి దిండు పంచ్‌ను తప్పించుంటాడు. తన దిండుతో దాడి చేస్తాడు. రెఫరీలు.. ఇద్దరి మధ్య తలగడల పోరు ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే, ఇందులో ఎవరూ గాయపడరు. ఎక్కడా రక్తపు చుక్క బయటకు రాదు. కానీ, మిగతా కంబాట్ స్పోర్ట్స్‌లో ఉండే అన్నీ ఫీచర్లు ఇందులో ఉంటాయి.
అమెరికాలోని ఫ్లోరిడాలో పిల్లో ఫైటింగ్ చాంపియన్‌షిప్ నిర్వహించారు. ఇందులో మహిళ, పురుషుల విభాగాలు ఉన్నాయి. మహిళల విభాగంలో బ్రెజిల్‌కు చెందిన ఇస్టెలా న్యూన్స్.. అమెరికాకు చెందిన కెండాల్ వోల్కర్‌ను ఓడించి టైటిల్ గెలుచుకున్నారు. కాగా, పురుషుల విభాగంలో అమెరికాకు చెందిన హాలీ తిల్మన్ టైటిల్ సాధించారు. వారికి టోర్నమెంట్ నిర్వాహకులు టైటిల్స్ అందించారు.
అంతర్జాతీయంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే క్రీడాను డెవలప్ చేయాలనే ఆలోచనలో నుంచే ఈ పిల్లో ఫైటింగ్ చాంపియన్‌షిప్ వచ్చిందని నిర్వాహకులు చెప్పారు. ప్రతి ఒక్కరు తమ బాల్యంలో సోదరి, సోదరులతో తలగడలతో వాదులాడుకున్న జ్ఞాపకాలను కలిగి ఉంటారని, వారందరినీ తమ పిల్లో ఫైటింగ్ టోర్నమెంట్ ఆకట్టుకుంటుందని వివరించారు. ఫైటర్లు గాయపడవద్దని, అసలు రక్తాన్ని చూడాలని చాలా మంది వీక్షకులు భావించబోరని పిల్లో ఫైటింగ్ చాంపియన్‌షిప్ సీఈవో స్టీవ్ విలియమ్స్ తెలిపారు. వారు కేవలం ఆరోగ్యకరమైన పోటీ కోరుకుంటారని వివరించారు. ఈ క్రీడా స్వల్ప సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.
