పెట్రోల్  ధరలు రోజు రోజుకి పైకి ఎగబాకుతున్నాయి. ఒకేసారి ఏకంగా 26 రూపాయలను పెంచడంతో... ప్రజలు లబోదిబోమంటున్నారు. నిన్నటివరకు 74.52గా ఉండగా... ఒకే దెబ్బకు 100.10 కు చేరుకుంది. పెట్రోల్ తోపాటుగా డీజిల్ ధరలు కూడా 100 మార్కును దాటాయి. 

హై స్పీడ్ డీజిల్ కూడా 21 రూపాయల మేర పెరగడంతో.... పెట్రోల్ కన్నా డీజిల్ ధరెక్కువయిపోయిందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇంతకు ఏ పెరుగుదల ఎక్కడ అని అనుకుంటున్నారా పాకిస్తాన్ లో. ఆఖరికి కిరోసిన్ ధరను కూడా అక్కడి ప్రభుత్వం పెంచేసింది. 

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ధరలను పెంచినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇకపోతే భారతదేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల మంట రోజు రోజుకి కొనసాగుతూనే ఉంది. నేడు శుక్రవారం వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. పెట్రోల్‌ లీటర్‌కు 22 పైసలు, డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పెరిగింది.

పెరిగిన ధరతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 83.18 రూపాయలు, డీజిల్  ధర లీటరుకు రూ.78.19 చేరింది. అయినప్పటికీ, ఇతర మెట్రో నగరాలైన కోల్‌కతా, ముంబై మరియు చెన్నైలలో డీజిల్ రేట్ల కంటే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.

శుక్రవారం మెట్రో నగరరాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు వరుసగా నేడు మళ్ళీ పెరిగాయి, ఢిల్లీలో పెట్రోల్ కంటే డీజిల్ ధర వరుసగా మూడవ రోజు కూడా పెరిగింది. 12 వారాల విరామం తరువాత ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు రోజువారీ సమీక్షల తరువాత తాజా పెంపుతో డీజిల్ ధరలు వరుసగా 20 రోజులు పాటు పెరుగుతూనే ఉంది.

దేశంలో అతిపెద్ద ఇంధన రిటైలర్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటరుకు ఉదయం 6 నుంచి రూ .79.92 నుండి రూ .80.13కు చేరింది, డీజిల్ ధర లీటరుకు రూ .80.02 నుండి లీటరుకు రూ .80.19 కు పెంచారు. 

మెట్రో నగరాలలో తాజా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి:

ఢిల్లీ  పెట్రోల్ 80,13, డీజిల్80,19
కోల్‌కతా పెట్రోల్ 81.82, డీజిల్ 75.34
ముంబై పెట్రోల్ 86.91, డీజిల్ 78.51
చెన్నై పెట్రోల్ 83.37, డీజిల్ 77.44